- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Bhabesh Chandra Roy: సాకులు వద్దు..బంగ్లాలో హిందూనేత హత్యపై భారత్ సీరియస్
బంగ్లాదేశ్ లో హిందూనేత హత్యపై భారత విదేశాంగ శాఖ ఘాటు వ్యాఖ్యలు చేసింది.

దిశ, డైనమిక్ బ్యూరో: మాజీ ప్రధాని షేక్ హసీనా దేశం విడిచి వెళ్లిన తర్వాత బంగ్లాదేశ్ లో (Bangladesh) మైనారిటీలు, హిందువులపై క్రమంగా దాడులు జరుగుతున్నాయి. తాజాగా ఉత్తర బంగ్లాదేశ్ లోని దినాజ్ పుర్ లో భబేశ్ చంద్ర రాయ్ (58)ని గురువారం దుండగులు కిడ్నాప్ చేసి దారుణంగా హత్య చేశారు. ఈ ఘటనపై తాజాగా భారతీయ విదేశాంగ శాఖ (Ministry of External Affairs) ఘాటుగా స్పందించింది. భబేశ్ చంద్ర రాయ్ (Bhabesh Chandra Roy) కిడ్నాప్, దారుణ హత్యను తీవ్రంగా ఖండిస్తున్నామని, బంగ్లాదేశ్‌లో తాత్కాలిక ప్రభుత్వ హయాంలో హిందూ మైనారిటీలపై వరుసగా కొనసాగుతున్న హింసను ఈ సంఘటన ప్రతిబింబిస్తుందని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తాజాగా సోషల్ మీడియా వేదికగా ఓ పోస్టు చేశారు. గతంలో ఇలాంటి నేరాలకు పాల్పడిన వారు ఎలాంటి శిక్ష లేకుండా స్వేచ్ఛగా తిరుగుతున్నారని సీరియస్ సీరియస్ అయ్యారు. ఎలాంటి సాకులు, వివక్ష లేకుండా హిందువులు సహా అన్ని మైనారిటీ వర్గాలను రక్షించే బాధ్యత ఈ తాత్కాలిక ప్రభుత్వానికి మరోసారి గుర్తుచేస్తున్నామని రణధీర్ జైస్వాల్ తన ప్రకటనలో పేర్కొన్నారు. కాగా నిన్న ఇంట్లో ఉన్న భబేశ్ చంద్రరాయ్ ఇంటికి వచ్చిన నలుగురు గుర్తు తెలియని వ్యక్తులు అతడిని ఇంటి నుంచి కిడ్నాప్ చేశారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు నరబరి గ్రామంలో భబేశ్ తీవ్రగాయాలతో కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతూ కనిపించాడు. అతడిని హుటాహుటీన ఆసుపత్రికి తరలించగా ఆలోపే మృతిచెందాడు.
హిందువుల రక్షణ విషయంలో మోడీ విఫలం: ఖర్గే
ఈ ఘటనపై కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రధాని నరేంద్ర మోడీపై విమర్శలు చేశారు. బంగ్లాదేశ్‌లో మైనారిటీలు, ముఖ్యంగా మన హిందూవులు నిరంతరం హింసకు గురవుతున్నారు. తాజాగా హిందూ నాయకుడు భబేష్ చంద్ర రాయ్ దారుణ హత్య ఈ విషయానికి నిదర్శనం అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ ఇటీవల బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రధాని యూనస్ తో నవ్వుతూ జరిపిన చర్చలు విఫలం అయ్యాయని విమర్శించారు. భారత ప్రభుత్వం పార్లమెంటులో ఇచ్చిన సమాధానం ప్రకారం గత రెండు నెలల్లోనే హిందువులపై 76 దాడులు జరిగాయని వాటిలో 23 మంది హిందువులు చంపబడ్డారని ధ్వజమెత్తారు. ఇతర మతపరమైన మైనారిటీలపై కూడా దాడులు కొనసాగుతున్నాయన్నారు.






