- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Illegal Betting Case : బెట్టింగ్ రాకెట్‌లో కింగ్.. కాంగ్రెస్ ఎమ్మెల్యే అరెస్ట్..
కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే కేసీ వీరేంద్రను ఈడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. నిన్న, ఈరోజు కర్ణాటక, గోవా, ముంబై, సిక్కిం, రాజస్థాన్‌లోని 31 ప్రదేశాలలో సోదాలు నిర్వహించిన అధికారులు.. పెద్దమొత్తంలో ఆన్‌లైన్, ఆఫ్ లైన్ బెట్టింగ్ రాకెట్ నడుపుతున్నట్లు గుర్తించారు

దిశ, వెబ్ డెస్క్ : కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే కేసీ వీరేంద్రను ఈడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. నిన్న, ఈరోజు కర్ణాటక, గోవా, ముంబై, సిక్కిం, రాజస్థాన్‌లోని 31 ప్రదేశాలలో సోదాలు నిర్వహించిన అధికారులు.. పెద్దమొత్తంలో ఆన్‌లైన్, ఆఫ్ లైన్ బెట్టింగ్ రాకెట్ నడుపుతున్నట్లు గుర్తించారు. గ్యాంగ్‌టక్‌లో అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అంతేకాదు అతని సోదరుడు కేసీ తిప్పేస్వామి, మేనల్లుడు పృథ్వి ఎన్ రాజ్, ఇతర కుటుంబీకులకు సంబంధించిన ఆస్తులు, గోవాలోని కాసినోలపై దాడులు నిర్వహించిన ఈడీ.. సుమారు రూ. 12 కోట్ల నగదు, ఆరు కోట్లు బంగారు ఆభరణాలు, 10 కిలోల వెండి, వాహనాలు, ఆస్తి పత్రాలు, ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. కింగ్ 567, పప్పీస్003, రాజా 567, రత్న గేమింగ్ వంటి బెట్టింగ్ వెబ్ సైట్స్ నడుపుతున్నట్లు తేల్చిన అధికారులు.. ఆయన సోదరుడు దుబాయ్ బెట్టింగ్ సంస్థలతో సంబంధాలు కలిగి ఉన్నట్లు తెలిపారు.
కాగా వీరెంద్రను గ్యాంగ్‌టక్ మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచిన ఈడీ.. బెంగళూరు తీసుకెళ్లేందుకు ట్రాన్సిట్ రిమాండ్ పొందింది. కాగా వీరేంద్ర 2016లో డీమోనిటైజేషన్ కరెన్సీ మార్పిడి కేసులోనూ పట్టబడ్డాడు.






