- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాజ్యాంగంపై గౌరవం ఉంటే పదవికి రాజీనామా చేయ్
రాజ్యాంగానికి, ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా ఎమ్మెల్యే పదవిలో కొనసాగుతున్న కడియం శ్రీహరి రాజీనామా చేయాలని మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య అన్నారు.

రాజ్యాంగంపై గౌరవం ఉంటే పదవికి రాజీనామా చేయ్
గోబెల్ ప్రచారంలో కడియం శ్రీహరి దిట్ట
మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య
దిశ,లింగాల ఘణపురం : రాజ్యాంగానికి, ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా ఎమ్మెల్యే పదవిలో కొనసాగుతున్న కడియం శ్రీహరి రాజీనామా చేయాలని మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య అన్నారు. ఊరూరుకి బీఆర్ఎస్ సంక్షేమ, అభివృద్ధి పథకాలు కార్యక్రమంలో భాగంగా మండలంలోని పలు గ్రామాల్లో పర్యటించారు. అనంతరం నాగారం గ్రామంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కడియం శ్రీహరికి రాజకీయ చరిత్ర ఉన్నా ఈ రోజు ఏ పార్టీలో ఉన్నాడో చెప్పడానికి మతిస్థిమితం లేని మాటలు మాటలు మాట్లాడుతున్నాడని ఎద్దేవా చేశారు. గోబెల్ ప్రచారం చేసుకోవడంలో కడియం శ్రీహరి దిట్ట అని విమర్శించారు. గత ప్రభుత్వం చేసిన అభివృద్ధి నియోజకవర్గంలో కనిపిస్తుందని, 21 నెలల కాంగ్రెస్ పాలనలో నియోజకవర్గ ప్రజలకు కడియం శ్రీహరి చేసింది ఏమీ లేదని దుయ్యబట్టారు. ఇంటిగ్రేటెడ్ స్కూళ్లకు తట్టమట్టి కూడా తీయలేదని విమర్శించారు. కొత్తగా ఏర్పడ్డ మున్సిపాలిటీకి నిధులు కూడా తీసుకురాలేని చేతకాని వ్యక్తి అని ఘాటుగా విమర్శించారు. ఇక కడియం శ్రీహరి ఏమి చేయలేక, మరోసారి పోటీ చేయనని చేతులెత్తేశారన్నారు. దమ్ముంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మాట్లాడాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు శ్రీనివాస్, ఏదునూరి వీరయ్య, గండి యాదగిరి, చిట్ల ఉపేందర్ రెడ్డి, శేఖర్, సంపత్, గోరిగే మదర్, రేగు శ్రీశైలం,ఆంజనేయులు, విష్ణు వెంకటేష్, తదితరులు పాల్గొన్నారు






