GV Reddy: ఏపీ బడ్జెట్‌పై జీవీరెడ్డి సంచలన పోస్ట్

by Yella Dhawani Reddy |

ఏపీ అసెంబ్లీలో శుక్రవారం (ఫిబ్రవరి 28) కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్‌పై (AP Budget) మాజీ టీడీపీ (TDP) నేత జీవీ రెడ్డి (GV Reddy) స్పందించారు.

GV Reddy: ఏపీ బడ్జెట్‌పై జీవీరెడ్డి సంచలన పోస్ట్
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీ అసెంబ్లీలో శుక్రవారం (ఫిబ్రవరి 28) కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్‌పై (AP Budget) మాజీ టీడీపీ (TDP) నేత జీవీ రెడ్డి (GV Reddy) స్పందించారు. కేవలం రూ.33,000 కోట్ల అతి తక్కువ రెవెన్యూ లోటుతోనే రూ.3 లక్షల 22 వేల కోట్ల భారీ బడ్జెట్‌ను ప్రణాళికబద్ధంగా రూపొందించారని కొనియాడారు. తాను రాజకీయాలకు దూరంగా ఉప్పప్పటికీ సీఎం చంద్రబాబు (CM Chandrababu) నాయకత్వం పట్ల ఎప్పటికీ గౌరవం, అభిమానం ఉంటుందన్నారు. ఏపీ అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం 2029లోనూ చంద్రబాబు సీఎం కావాలని కోరుకున్నారు. రాష్ట్ర పురోగతికి ఆయనకు మద్దతుగా నిలవడం ప్రతి తెలుగువ్యక్తి బాధ్యత అని జీవీ రెడ్డి చెప్పారు. తక్కువ కాలంలోనే టీడీపీ లోనూ, ప్రభుత్వ వ్యవస్థలోనూ తనకు గౌరవప్రదమైన బాధ్యతలు అప్పగించడం జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేనన్నారు. ఈ అవకాశం ఇచ్చినందుకు ఎప్పటికీ చంద్రబాబుకు రుణపడి ఉంటానన్నారు. ఈ మేరకు ఆయన ఎక్స్‌లో శనివారం (మార్చి 1) పోస్టు పెట్టారు.

కాగా, ఇటీవల ఏపీ ఫైబర్‌నెట్‌ లిమిటెడ్‌ ఎండీ దినేష్‌కుమార్‌పై తీవ్ర ఆరోపణలు చేయడం, తదనంతర పరిణామాల నేపథ్యంలో ఆ సంస్థ ఛైర్మన్‌ పదవికి జీవీ రెడ్డి రాజీనామా చేశారు. అలాగే టీడీపీ (TDP) జాతీయ అధికార ప్రతినిధి పదవికి, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తున్నట్లు సీఎం చంద్రబాబుకు లేఖ రాశారు.

Next Story