తెలంగాణలోని ఆ రెండు ఉచిత పథకాలతో ఏడాదికి రూ.2 లక్షల చిట్టి కట్టుకుంటున్న మహిళ

by Sujitha Rachapalli |

కాంగ్రెస్ ప్రభుత్వ పాలన తనను ఆర్థికంగా బలంగా చేసిందని తెలిపింది వేములవాడకు చెందిన మహిళ. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సామాన్య మహిళ మాటల్లో ప్రభుత్వ విజయగాథ అంటూ

తెలంగాణలోని ఆ రెండు ఉచిత పథకాలతో ఏడాదికి రూ.2 లక్షల చిట్టి కట్టుకుంటున్న మహిళ
X

దిశ, వెబ్ డెస్క్ : కాంగ్రెస్ ప్రభుత్వ పాలన తనను ఆర్థికంగా బలంగా చేసిందని తెలిపింది వేములవాడకు చెందిన మహిళ. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సామాన్య మహిళ మాటల్లో ప్రభుత్వ విజయగాథ అంటూ కాంగ్రెస్ శ్రేణులు ఈ వీడియోను ట్రెండింగ్‌లోకి తీసుకొచ్చాయి. ‘ఉచిత బస్సు పథకం ద్వారా నేను ఎంత లాభపడ్డానంటే.. నేను బస్సులో చేసిన ప్రయాణ ఖర్చులు ఫ్రీ కావడంతో రెండు లక్షల చిట్టి వేసుకున్నాను. ఫ్రీ బస్సు, సన్న బియ్యం పథకాల ద్వారా మిగిలిన డబ్బుతో నా బిడ్డను బాగా చదివించుకుంటున్నాను. రేవంత్ అన్న ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నాను. ప్రతి మహిళ ఈ అవకాశాన్ని చక్కగా ఉపయోగించుకోవాలి.. ప్రభుత్వం పది కాలాల పాటు చల్లగా ఉండాలి.. రేవంత్ అన్న మరో పదేళ్లు సీఎంగా ఉండాలి’ అని కోరుకుంది.

VIDEO

Next Story