మెగాస్టార్ చిరంజీవి రాజకీయాలకు పనికిరారు.. మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు

by Gantepaka Srikanth |

వైసీపీ(YCP) కీలక నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు(Ambati Rambabu) కీలక వ్యాఖ్యలు చేశారు.

మెగాస్టార్ చిరంజీవి రాజకీయాలకు పనికిరారు.. మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: వైసీపీ(YCP) కీలక నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు(Ambati Rambabu) కీలక వ్యాఖ్యలు చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) రాజకీయాలకు పనికిరారు అని హాట్ కామెంట్ చేశారు. ప్రజారాజ్యం పార్టీ రూపాంతరం చెంది జనసేనగా మారిందని చేసిన వ్యాఖ్యల్లో అర్థమేంటో చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రజారాజ్యం(Praja Rajyam Party) లాగే జనసేన(Janasena Party)ను కూడా బీజేపీలో విలీనం చేస్తారా? అని ప్రశ్నించారు. ఈ సందర్భంగా తిరుమల కల్తీ నెయ్యి టెండర్లలో అవకతవకలపైనా మాట్లాడారు. జంతువుల కొవ్వు కలిసిందని గానీ, కల్తీ జరిగిందని గానీ ఎలాంటి ఆధారాలు లేవు.. పరిశుభ్రతకు, తిరుపతి ప్రసాదాలు మారు పేరు అని అన్నారు.

రాజకీయ లబ్ధి పొందాలని.. తిరుమల లడ్డూ ప్రసాదంలో జంతు కొవ్వు కలిసిందని చంద్రబాబు అసత్య ప్రచారాలు చేశారు. దేవుడ్ని అడ్డం పెట్టుకుని రాజకీయం చేయాలని చంద్రబాబు కుట్ర చేశారని ఆరోపించారు. అయితే, తిరుపతి లడ్డూ ప్రసాదంలో జంతు కొవ్వు వాడారని ఒక్క చంద్రబాబే కాదు పవన్ కళ్యాణ్ అనవసర ఆరోపణలు చేశారని అంబటి రాంబాబు ఫైర్ అయ్యారు. తిరుమల లడ్డూల తయారీకి నెయ్యి సరఫరాకు ఒక పద్దతి ఉంటుందన్నారు. జగన్ హయాంలో టెస్టుల్లో ఫెయిల్ అయిన ట్యాంకర్లను వెనక్కి పంపారని మాజీ మంత్రి అంబటి చెప్పుకొచ్చారు.

కాగా, టాలీవుడ్(Tollywood) యంగ్ హీరో విశ్వక్‌సేన్(Vishwak Sen) ప్రధాన పాత్రలో వస్తోన్న సినిమా లైలా. ఈ సినిమా ప్రీరిలీజ్ ఫంక్షన్‌‌ను ఆదివారం హైదరాబాద్ వేదికగా నిర్వహించారు. దీనికి చీఫ్ గెస్ట్‌గా హాజరైన చిరంజీవి మాట్లాడుతూ.. ‘జై జనసేన.. ప్రజారాజ్యం మారిపోయింది. ప్రజారాజ్యం రూపాంతరం చెందింది జనసేనగా మారింది. నేను చాలా సంతోషంగాఉన్నాను’ అని చిరంజీవి వ్యాఖ్యానించారు. అయితే, జనసే పార్టీ స్థాపించి పదేళ్లు దాటిన తరువాత చిరంజీవి మొదటిసారి బహిరంగంగా జైజనసేన అనడం కొత్త చర్చకు దారితీస్తోంది. మొత్తానికి మెగా ఫ్యాన్స్‌ మాత్రం ఫుల్ ఖుషీలో ఉన్నారు.




Next Story