అధికార పార్టీకి బిగ్ షాక్.. ఏడుగురు ఎమ్మెల్యేలు రాజీనామా

by Gantepaka Srikanth |   (  Updated:2025-01-31 13:08:16  IST  )

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు(Delhi Assembly Elections) సమీపిస్తోన్న వేళ అధికార ఆమ్ ఆద్మీ పార్టీ(Aam Aadmi Party)కి బిగ్ షాక్ తగిలింది.

అధికార పార్టీకి బిగ్ షాక్.. ఏడుగురు ఎమ్మెల్యేలు రాజీనామా
X

దిశ, వెబ్‌డెస్క్: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు(Delhi Assembly Elections) సమీపిస్తోన్న వేళ అధికార ఆమ్ ఆద్మీ పార్టీ(Aam Aadmi Party)కి బిగ్ షాక్ తగిలింది. ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా ఏడుగురు సిట్టింగ్ ఎమ్మెల్యేలు(Sitting MLAs) పార్టీకి రాజీనామా చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్లు ఇవ్వలేదనే రాజీనామాలు చేసినట్లు వెల్లడించారు. ఇదిలా ఉండగా.. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచార ఘట్టం తుది దశకు చేరుకుంది. ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండడంతో ఆప్(AAP), బీజేపీ(BJP), కాంగ్రెస్(Congress) నేతలు ఢిల్లీలో పార్టీ నేతలు పోటాపోటీగా ఎన్నికలు నిర్వహిస్తున్నారు. మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకు గానూ 699 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. అయితే హ్యాట్రిక్ కొట్టాలని ఆమ్ ఆద్మీ పార్టీ ఉవ్విళ్లూరుతోంది. కాంగ్రెస్, బీజేపీ పార్టీలు దేశ రాజధానిపై పట్టు సాధించాలని ప్రయత్నిస్తున్నాయి. ఇందులో భాగంగానే పార్టీ నేతలు విస్తృతంగా ప్రజల్లో తిరుగుతున్నారు.


ఈ ఎన్నికల్లో గెలిచి వరుసగా మరోసారి అధికారం చేజిక్కించుకోవాలని ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) చాలా ప్లాన్‌డ్‌గా ముందుకు వెళ్తోంది. బీజేపీ కూడా ఈసారి కచ్చితంగా అధికారంలోకి రావాలని ఎత్తుకు పైఎత్తులు వేస్తోంది. ఈ నేపథ్యంలోనే కేజ్రీవాల్ పాలనకు గండికొట్టి.. ఢిల్లీ అధికార పీఠాన్ని అందుకోవాలని వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. దీంతో ఈ రెండు పార్టీల మధ్య ప్రధాన పోరు జరగనుంది. ఢిల్లీలోని మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకు ఒకే విడతలో ఫిబ్రవరి 5న పోలింగ్‌ జరుగనుంది. అదే నెల 8న ఓట్ల లెక్కింపు జరగనుంది. ఢిల్లీలో 1.55 కోట్ల మంది ఓటర్లున్నారు. అందులో 83.49 లక్షల మంది పురుషులు కాగా 71.74 లక్షల మంది మహిళలు. 1,261 మంది ట్రాన్స్‌జెండర్లు. మొత్తం ఓటర్లలో 25.89 లక్షల మంది యువ ఓటర్లున్నారు. వారిలో 2.08 లక్షల మంది తొలిసారి ఓటు వేయనున్నారు.

Next Story