పొలిటికల్ లీడర్స్‌‌కు BIG అలర్ట్.. ప్రసంగాల్లో వారిని హేళన చేసేలా మాట్లాడితే అంతే సంగతి

by Gantepaka Srikanth |   (  Updated:2025-02-13 16:08:54  IST  )

రాజకీయ పార్టీలు, ప్రతినిధులు ఏదైనా బహిరంగ సభల ప్రసంగాలలో దివ్యాంగులను, వికలాంగులను కించపరుస్తూ వ్యాఖ్యలు చేయరాదని ఎన్నికల సంఘం ఆదేశించింది.

పొలిటికల్ లీడర్స్‌‌కు BIG అలర్ట్.. ప్రసంగాల్లో వారిని హేళన చేసేలా మాట్లాడితే అంతే సంగతి
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాజకీయ పార్టీలు, ప్రతినిధులు ఏదైనా బహిరంగ సభల ప్రసంగాలలో దివ్యాంగులను, వికలాంగులను కించపరుస్తూ వ్యాఖ్యలు చేయరాదని ఎన్నికల సంఘం ఆదేశించింది. వికలాంగుల హక్కుల చట్టం 2016 ప్రకారం సెక్షన్ 7 కింద పలు నిబంధనలు వర్తిస్తాయని సూచించింది. రాజకీయ ప్రతినిధులు వైకల్యాలు/వికలాంగులకు సంబంధించిన కామెంట్స్ చేయరాదని, సోషల్ మీడియాలో పోస్ట్‌లు, ప్రకటనలు, పత్రికా ప్రకటనల్లోనూ వారి పట్ల అసహ్యకరమైన లేదా వివక్షతతో కూడిన భాషను వాడరాదని సూచించింది. ప్రతి ఒక్కరూ ఈ నిబంధనలకు కట్టుబడి ఉండాలని ఆదేశించింది. లేదంటే చట్టం ప్రకారం శిక్షార్హులవుతారని హెచ్చరించింది.

Next Story