- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Delhi Elections: ఓటమిపై మాజీ సీఎం కేజ్రీవాల్ రియాక్షన్ ఇదే!
దేశ రాజధాని ఢిల్లీ అసెంబ్లీ (Delhi Assembly) ఎన్నికల్లో ఎవరూ ఊహించని విధంగా భారతీయ జనతా పార్టీ (BJP) ఘన విజయం సాధించింది.

దిశ, వెబ్ డెస్క్: దేశ రాజధాని ఢిల్లీ అసెంబ్లీ (Delhi Assembly) ఎన్నికల్లో ఎవరూ ఊహించని విధంగా భారతీయ జనతా పార్టీ (BJP) ఘన విజయం సాధించింది. 26 ఏళ్ల సుధీర్ఘ విరామం తరువాత ఢిల్లీ (Delhi)లో తమ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది. ఇక న్యూఢిల్లీ నియోజకవర్గం నుంచి పోటి చేసిన ఆమ్‌ఆద్మీ పార్టీ (Aam Aadmi Party) అగ్ర నేత, మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ (Aravind Kejriwal) బీజేపీ అభ్యర్థి పర్వేష్ సాహిబ్ వర్మ చేతిలో ఓటమిపాలయ్యారు.
ఈ నేపథ్యంలో కేజ్రీవాల్ మొదటిసారిగా తన ఓటమిపై స్పందించారు. ప్రజలు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నట్లు తెలిపారు. ఎన్నికల్లో విజయం సాధించిన బీజేపీకి అభినందనలు చెప్పారు. ప్రజా సేవ కోసమే రాజకీయాల్లోకి వచ్చానని, అధికారం కోసం రాలేదని వెల్లడించారు. ఢిల్లీ అసెంబ్లీలో ప్రతిపక్ష హోదాలో ఓటర్ల ప్రయోజనాల కోసం పోరాడుతామన్నారు. అలాగే, గత 10 సంవత్సరాలలో తమ ప్రభుత్వం ఆరోగ్యం, విద్య, మౌలిక సదుపాయాల రంగంలో చాలా కృషి చేసిందన్నారు.
— Arvind Kejriwal (@ArvindKejriwal) February 8, 2025






