Delhi CM: ఢిల్లీ సీఎం రేసులో పర్వేష్ వర్మ.. ఏం అన్నాడంటే?

by Yella Dhawani Reddy |   (  Updated:2025-02-08 14:03:44  IST  )

ఎన్నో ఏళ్ల నిరీక్షణ అనంతరం హస్తిన పీఠంపై కమలం పాగా వేసింది.

Delhi CM: ఢిల్లీ సీఎం రేసులో పర్వేష్ వర్మ.. ఏం అన్నాడంటే?
X

దిశ, వెబ్ డెస్క్: ఎన్నో ఏళ్ల నిరీక్షణ అనంతరం హస్తిన పీఠంపై కమలం పాగా వేసింది. కేంద్రంలోని బీజేపీకి ఢిల్లీ ప్రజలు పట్టం కట్టారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ పగ్గాలు బీజేపీ (BJP) అధిష్టానం ఎవరికి అప్పగించనుందో అనే ఆసక్తి అందరిలో నెలకొంది. ఇక సీఎం రేసులో (CM Race) న్యూ ఢిల్లీ నియోజకవర్గం నుంచి విజయం సాధించిన పర్వేష్ సాహిబ్ సింగ్ వర్మ (Parvesh Verma) పేరు ప్రధానంగా వినిపిస్తోంది. ఈ సందర్భంగా ఆయన ఈ విషయం గురించి మాట్లాడారు. బీజేపీ హైకమాండ్ మద్దతుతోనే ఢిల్లీలో కమలం పార్టీ విజయం సాధ్యమైందని పర్వేష్ వర్మ తెలిపారు. మార్పును కోరుకుంటూ బీజేపీపై విశ్వాసంతో తమని గెలిపించిన ఢిల్లీ ప్రజలను ఆయన ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు. ఇక ప్రధాని మోదీ (PM Modi) నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వంతో కలిసి డబుల్‌ ఇంజిన్‌ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. అయితే, ముఖ్యమంత్రి ఎవరనేది అధిష్టానమే నిర్ణయిస్తుందని, పార్టీ హైకమాండ్ నిర్ణయానికి అందరం కట్టుబడి ఉంటామని చెప్పారు. ఎన్నికల ప్రచారంలో బీజేపీ ఇచ్చిన ప్రతీ హామీని నెరవేరుస్తామని పర్వేష్ వర్మ తెలిపారు.

కాగా, న్యూఢిల్లీ నియోజకవర్గం నుంచి ఆప్ అధినేత, మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌పై (Aravind kejriwal) బీజేపీ తరపున పోటి చేసిన పర్వేష్ వర్మ విజయం సాధించిన సంగతి తెలిసిందే. కేజ్రీవాల్‌ 3 వేల ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. ఢిల్లీ మాజీ సీఎం సాహిబ్‌ సింగ్ వర్మ కుమారుడైన పర్వేష్ వర్మ.. 2013లో రాజకీయాల్లో ప్రవేశించారు. 2014 నుంచి 2024 వరకు పశ్చిమ ఢిల్లీ నుంచి లోక్‌సభ సభ్యుడిగా కొనసాగారు. 2019లో జరిగిన ఎన్నికల్లో ఈయన రికార్డు స్థాయిలో 5.78 లక్షల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.

Next Story