- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
దుర్యోధనుడు వైఎస్ జగన్ ఇద్దరు ఒక్కటే.. సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ
దుర్యోధనుడి చరిత్ర .. వైఎస్ జగన్ చరిత్ర ఒకటేనని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు.

దిశ, డైనమిక్ బ్యూరో : దుర్యోధనుడి చరిత్ర .. వైఎస్ జగన్ చరిత్ర ఒకటేనని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్‌కు అచ్చోసిన ఆంబోతుల్లా 30 మందికి పైగా సలహాదారులు ఉన్నారని, వారి వల్ల ఏం ప్రయోజనం అని నిలదీశారు. రాజన్న పేరు చెప్పి ఆయనకే జగన్ మూడు నామాలు పెడుతున్నారంటూ ధ్వజమెత్తారు. బటన్ నొక్కితే సమస్యలు పరిష్కారం కావు అని చెప్పుకొచ్చారు. బంకర్లలో కూర్చుని జగనన్నకు చెబుదాం అంటే ఎలా చెప్పగలరు అని ప్రశ్నించారు.
మరోవైపు సీఎం వైఎస్ జగన్ ప్రధాని నరేంద్రమోడీ జపం చేస్తున్నారని నారాయణ విమర్శించారు. రాష్ట్రానికి రావాల్సిన ప్రయోజనాలకు బీజేపీ గండి కొడుతున్నా జగన్‌కు పట్టడం లేదని మండిపడ్డారు. మోడీ, జగన్ ఇద్దరూ కవల పిల్లలని చెప్పుకొచ్చారు. ‘దేశాన్ని రక్షించండి.. మోడీని ఓడించండి’ అనే నినాదంతో దేశవ్యాప్తంగా ఎన్నికలకు వెళ్తామని, ఏపీలో మాత్రం ‘మోడీ, జగన్ హటావో’ అంటూ ఎన్నికలకు వెళ్తామని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ చెప్పుకొచ్చారు.






