- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
AP Politics: ఎమ్మెల్యే వంశీ కృష్ణకు అభినందనలు
విశాఖ దక్షిణ నియోజకవర్గం నుంచి గెలుపొందిన ఎమ్మెల్యే, జనసేన జిల్లా అధ్యక్షులు వంశీకృష్ణ శ్రీనివాస్‌కు అభినందనలు వెల్లువెత్తాయి.

X
దిశ ప్రతినిధి, విశాఖపట్నం: విశాఖ దక్షిణ నియోజకవర్గం నుంచి గెలుపొందిన ఎమ్మెల్యే, జనసేన జిల్లా అధ్యక్షులు వంశీకృష్ణ శ్రీనివాస్‌కు అభినందనలు వెల్లువెత్తాయి. ఆదివారం ఉదయం శివాజీ పాలెంలోని పార్టీ కార్యాలయంలో పెద్ద ఎత్తున పార్టీ వర్గాలు వివిధ సంఘాల నేతలు పెద్ద ఎత్తున తరలి వచ్చి పుష్పగుచ్ఛాలు అందజేసి దుశ్శాలువతో సత్కరించారు.
ఆర్టీసీ మజ్దూర్ యూనియన్, రెవెన్యూ ఉద్యోగుల సంఘం నాయకులు, కనకమహాలక్ష్మి దేవస్థానం ఈవో, సత్యనారాయణ స్వామి దేవస్థానం ఈవో, గ్రామ సంఘాల పెద్దలు, వార్డ్ కమిటీల నాయకులు, మొదలైన వారు వంశీకృష్ణను అభినందించిన వారిలో ఉన్నారు. జనసేన, తెలుగుదేశం, బిజెపి పార్టీ నాయకులు, స్థానిక నాయకులు, వివిధ సంఘాల నేతలు ఎమ్మెల్యే వంశీ ని ఘనంగా సత్కరించారు. పార్టీ కార్యకర్తలు, అభిమానులు ఫోటోలు దిగేందుకు ఉత్సాహంగా చూపించారు
Next Story






