- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
దావోస్‌లో సీఎం చంద్రబాబు బిజీ బిజీ.. రాష్ట్రానికి భారీ పెట్టుబడులు!
స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో మంగళవారం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు రెండో రోజు పర్యటన కొనసాగుతోంది.

దిశ, వెబ్ డెస్క్: స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో మంగళవారం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు రెండో రోజు పర్యటన కొనసాగుతోంది. ఈ పర్యటనలో భాగంగా.. వరల్డ్ ఎకనమిక్ ఫోరం(WEF) సదస్సులో ప్రపంచ దిగ్గజ కంపెనీల అధిపతులతో చంద్రబాబు వరుస సమావేశాల్లో పాల్గొన్నారు. ఇక మిట్టల్ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ లక్ష్మీ మిట్టల్, CEO ఆదిత్య మిట్టల్‌తో సీఎం చంద్రబాబు, మంత్రులు నారా లోకేష్, టీజీ భరత్ సమావేశమయ్యారు. ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు అన్నీ అవకాశాలు ఉన్నాయని.. ఏపీలో పెట్టుబడులకు ముందుకు రావాలని కోరారు. ఈ సందర్భంగా లక్ష్మీ మిట్టల్ మాట్లాడుతూ.. ఆర్సెలార్ మిట్టల్, జపాన్‌కు చెందిన నిప్పాన్ స్టీల్ జేవీ సంయుక్తంగా 17.8 మిలియన్ టన్నుల కెపాసిటీతో ఇప్పటికే గ్రీన్ ఫీల్డ్ స్టీల్ ప్రాజెక్ట్ ఏర్పాటు ప్రక్రియను ఏపీలో ప్రారంభించామని గుర్తుచేశారు. అనకాపల్లి సమీపంలో 2 దశల్లో రూ.1.4 లక్షల కోట్ల పెట్టుబడితో ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు.
అనంతరం సీఎం చందబ్రాబు మాట్లాడుతూ.. ఈ గ్రీన్ ఫీల్డ్ స్టీ ప్రాజెక్ట్ అతిపెద్ద గ్రీన్‌ఫీల్డ్ ప్రాజెక్టుల్లో ఒకటిగా అది నిలుస్తుందని చెప్పారు. అలాగే భావనపాడులో పెట్రో కెమికల్ హబ్ ఏర్పాటుకు పెట్టుబడులకు మిట్టల్ గ్రూపును ఆహ్వానించారు. భావనపాడు పెట్రోకెమికల్స్ అన్వేషణకు అనువైన ప్రాంతామన్నారు. అలాగే రూ.3,500 కోట్లతో HPCL-మిట్టల్ సంయుక్త భాగస్వామ్య సంస్థ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ ఆధ్వర్యంలో భారత్‌లో ఏర్పాటు చేయాలని భావిస్తున్న 2 GW సామర్థ్యం గల సోలార్ సెల్ తయారీ ప్లాంట్‌ను ఏపీలో ఏర్పాటు చేయాలని కోరారు. ఏపీ ప్రభుత్వం ఈ ప్రాజెక్టుకు సంబంధించి అన్నివిధాలా సహాయ, సహకారాలు అందిస్తుందన్నారు.
అలాగే ఇవాళ సీఎం చంద్రబాబు గ్రీన్ హైడ్రోజన్-గ్రీన్ మాన్యుఫాక్చరింగ్, నెక్ట్స్ పెట్రోకెమికల్ హబ్, ఎనర్జీ ట్రాన్సిషన్, బ్లూ ఎకానమీ సదస్సులు, రౌండ్ టేబుల్ సమావేశాలకు హాజరుకానున్నారు. సింగపూర్ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ గాన్ కిమ్ యాంగ్, UAE ఎకానమీ మినిస్టర్‌తోనూ భేటీ కానున్నారు. వెల్స్‌పన్ చైర్మన్ బీకే గోయింకా, ఎల్జీ కెమ్ CEO షిన్ హక్ చియోల్, కార్ల్స్‌బెర్గ్ CEO జాకబ్ ఆరుప్ ఆండర్సన్, టాటా సన్స్ అండ్ టాటా గ్రూప్ చైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్, వాల్‌మార్ట్ ప్రెసిడెంట్-CEO కాత్ మెక్లే, సిస్కో CEO చుక్ రాబిన్స్, కాగ్నిజెంట్ CEO రవికుమార్ తదితరులతో రాష్ట్రంలో పెట్టుబడులపై చర్చించనున్నారు. అనంతరం బ్లూమ్‌బెర్గ్ వంటి అంతర్జాతీయ మీడియా సంస్థలకు ఇంటర్వ్యూల ద్వారా రాష్ట్ర ప్రభుత్వ పాలసీలు, పెట్టుబడులకు ఉన్న అవకాశాలను సీఎం చంద్రబాబు వివరించనున్నారు.






