- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Chandrababu: ఆంధ్రాలో ఆగని అల్లర్లు.. చంద్రబాబు సంచలన ట్వీట్..
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు ముగిసి నేటికి మూడు రోజులు గడుస్తున్నా, ఇప్పటికీ తాడిపత్రిలో ఘర్షణలు సద్దుమణగలేదు.

దిశ వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు ముగిసి నేటికి మూడు రోజులు గడుస్తున్నా, ఇప్పటికీ తాడిపత్రిలో ఘర్షణలు సద్దుమణగలేదు. నిత్యం దాడులతో తాడిపత్రి అట్టుడుకుతోంది. ప్రస్తుతం ఈ ఘర్షణల సెగ విశాఖకు సైతం తాకినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు X వేదికగా స్పంధించారు. రాష్ట్రంలో పోలింగ్ అనంతరం వైసీపీ రౌడీల దాడులను కంట్రోల్ చేయడంలో పోలీసులు విఫలం అవుతున్నారని పేర్కొన్నారు.
ప్రస్తుతం ఈ హింస ప్రశాంతమైన విశాఖకు సైతం చేరిందని ఆవేదన వ్యక్తం చేశారు. నగరంలోని నార్త్ నియోజకవర్గంలో వైసీపీ ఇచ్చిన డబ్బులను నిరాకరించి, టీడీపీకి ఓటు వేశారన్న కారణంతో నలుగురిపై దారుణంగా దాడిచేశారని మండిపడ్డారు. ఆడవాళ్లపై కూడా పాశవిక దాడికి పాల్పడ్డారని ఆరోపించారు. వైసీపీ మూకలు చేస్తున్న దాడుల విషయంలో పోలీసులు ఉదాసీనంగా వ్యవహరించడం వల్లనే శాంతి భద్రతల సమస్యలు తలెత్తుతున్నాయని పేర్కొన్నారు.
పల్నాడులో ఇప్పటికీ సమస్య పరిష్కారం కాలేదని, వైసీపీ రౌడీ మూకలు ఇళ్లలో బాంబులు, మారణాయుధాలు పెట్టుకుని దాడులకు తెగబడుతున్నారని ధ్వజమెత్తారు. పోలీసులు పూర్తి స్థాయిలో తనిఖీలు నిర్వహించి గూండాలను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. మాచర్లలో మారణహోమానికి కారణం అయిన ఎమ్మెల్యే పిన్నెల్లిపై కేసులు పెట్టి వెంటనే అరెస్టు చేస్తే తప్ప అక్కడ దాడులు ఆగే పరిస్థితి లేదని తెలిపారు.
అలాగే విజయవాడ భవానీపురంలో పోలింగ్ రోజు జరిగిన దాడి కేసులో నిందితుడు, పోలీసుల అదుపులో ఉన్న వైసీపీ నేత స్టేషన్ నుంచి పారిపోవడం పోలీసుల ఉదాసీన వైఖరికి నిదర్శనంని పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన ఎన్నికల హింసకు కారణమైన నిందితులపై కఠిన సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి జైలుకు పంపాలని, తప్పు చేసిన పోలీసు అధికారులను బదిలీ చేయడమే కాకుండా.. వారిపై కూడా కేసులు నమోదు చేసి విచారణ చేపట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను అంటూ ట్వీట్ చేశారు.






