- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సుధాకర్ చాలా మంచి వ్యక్తి.. మళ్లీ గెలిపించండి: బ్రహ్మానందం
కర్ణాటక ఎన్నికల్లో ఏపీ, తెలంగాణ నేతలే కాదు.. సినీ నటులు కూడా ప్రచారం చేస్తున్నారు. కొందరు కాంగ్రెస్ పార్టీకి ప్రచారం నిర్వహిస్తుండగా మరికొందరు బీజేపీకి మద్దతుగా ప్రచారం చేస్తున్నారు.

దిశ, డైనమిక్ బ్యూరో: కర్ణాటక ఎన్నికల్లో ఏపీ, తెలంగాణ నేతలే కాదు.. సినీ నటులు కూడా ప్రచారం చేస్తున్నారు. కొందరు కాంగ్రెస్ పార్టీకి ప్రచారం నిర్వహిస్తుండగా మరికొందరు బీజేపీకి మద్దతుగా ప్రచారం చేస్తున్నారు. తెలుగు వారు ప్రాంతాల్లో తిరిగి తాము మద్దతు తెలిపిన అభ్యర్థులకే ఓటు వేయాలని కోరుతున్నారు. అయితే హాస్య నటుడు బ్రహ్మానందం కూడా కర్ణాటక ఎన్నికల ప్రచార బరిలోకి దిగారు. బీజేపీ మంత్రి సుధాకర్ తరపున తెలుగువారుండే ప్రాంతాల్లో పర్యటించారు. మంత్రి సుధాకర్‌కు ఓటు వేయాలని అభ్యర్థించారు. మంత్రి సుధాకర్ చాలా వారని, ఆయన గెలిపించేందుకు తాను హైదరాబాద్ నుంచి వచ్చానని తెలిపారు. మంత్రి సుధాకర్ చిన్న తనం నుంచే చాలా మంచి పనులు చేశారన్నారు. తెలుగు వ్యక్తి అయిన సుధాకర్ కర్ణాటకలో మంత్రి కావడం మనందరి అదృష్టమని పేర్కొన్నారు. తెలుగువారందరూ ఓటు వేసి మళ్లీ ఆయన్ను మంత్రి చేయాలని కర్ణాటక తెలుగు ప్రజలకు బ్రహ్మానందం సూచించారు. అలాగే సినిమా డైలాగ్స్ చెబుతూ ప్రజల్ని ఆకట్టుకునే ప్రయత్నం చేశారు.
ఇవి కూడా చదవండి:
రజినీకాంత్ 100% కరెక్ట్.. ఆయన మాటలు చాలా పర్ఫెక్ట్‌గా ఉంటాయి : జగపతి బాబు






