- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బొత్స రాజకీయ వారసురాలిగా అనూష.. అమ్మ సెంటిమెంట్ కలిసివస్తుందా?
బొత్స సత్యనారాయణ తర్వాత ఆయన రాజకీయ వారసులు ఎవరు అంటే.. వైసీపీ శ్రేణుల నుంచి కూతురు బొత్స అనూష పేరు వినిపిస్తోంది.

దిశ, వెబ్‌డెస్క్: పీసీసీ అధ్యక్షుడిగా..మంత్రిగా..ఇప్పుడు ఏపీ శాసనమండలి విపక్ష నేతగా బొత్స సత్యనారాయణ రాజకీయ ప్రస్థానం కొనసాగుతుంది. మరి ఆయన తర్వాత రాజకీయ వారసులు ఎవరు అంటే.. వైసీపీ శ్రేణుల నుంచి ఆయన కూతురు బొత్స అనూష పేరు వినిపిస్తోంది. వారసత్వ రాజకీయాల్లోకి రావడం అంటే.. అంత చిన్న విషయం కాదు. ఎందుకంటే కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు వాళ్ల లీడర్ ఎలా ఉండాలో ముందే ఊహించుకుంటారు. వాళ్ల ఊహలకు తగినట్లు ఎంట్రీతోపాటు ప్రజలను దగ్గరికి తీసుకోవడం, ఆకర్షించే ప్రసంగాలు ఇవన్నీ ఉండటంతోపాటు తమ లీడర్ అరంగేట్రం అదిరిపోయేలా ఉండాలని కోరుకుంటారు. అలాంటిది బొత్స కుటుంబం నుంచి రాజకీయ వారసులు వస్తున్నారు అంటే.. ఆ వ్యక్తి ఎవరా అన్న ఆసక్తి పెరుగుతోంది. ఇటీవల వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పుట్టినరోజు జరుపుకోగా.. గరివిడిలో ఆయన జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు బొత్స అనూష. అప్పటి నుంచి వైసీపీ శ్రేణుల్లో అనూషపేరు బలంగా వినిపిస్తోంది. ఇప్పటికే విజయనగరం జిల్లాలో బొత్స వారసులు రాజకీయ ఎంట్రీ ఖరారు అనేది క్లారిటీ వచ్చింది. కానీ వారుసుడు వస్తున్నాడా..? వారసురాలు వస్తున్నారా..? అనే సందేహలకు మాజీ సీఎం జగన్ జన్మదిన వేడుకలతో సమాధానం దొరికిందని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి.
బొత్స సత్యనారాయణ శాసనమండలి విపక్ష నేతగా ఉండటంతో నియోజకవర్గ బాధ్యతలను అనూష పర్యవేక్షిస్తున్నారు. దీంతో చీపురుపల్లి నియోజకవర్గంలో గ్రౌండ్ లో నాయకులు, కార్యకర్తలకు నేనున్నాంటూ అనూష భరోసానిస్తూ జనంలోకి వెళ్తున్నారు. ఈ సందర్భంగా పార్టీ కార్యక్రమాలను ఒకింత వేగంగా తీసుకెళ్లడంలో సక్సెస్ అయిందని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. మెడికల్ కాలేజీల వ్యవహారంలో నియోజకవర్గం నుంచి కోటి సంతకాలను సేకరించడంలో సక్సెస్ అయ్యారు.
తల్లి సెంటిమెంట్ ఆమెకూ కలిసి వస్తుందా?
బొత్స వారసుడిగా సందీప్ ఇప్పటికే జనం మధ్య ఉంటూ వివిధ సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. కానీ అనూష కార్యకర్తలు, నాయకులతో మమేకం అవుతున్న తీరు చూసిన పార్టీ వర్గాలు మాత్రం బొత్స అనూష రాజకీయ అరంగేట్రం ముందుగానే జరుగుతుందని భావిస్తున్నారు. నియోజకవర్గంలోని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ క్యాడర్ సైతం ఆమె త్వరలో జరిగే స్థానిక పోరులో బరిలో నిలచి జడ్పీ పీఠాన్ని కైవసం చేసుకుంటుందని భావిస్తున్నారు. గతంలో ఆమె తల్లి బొత్స ఝూన్సీ సైతం జడ్పీ చైర్ పర్సన్‌తోనే రాజకీయ ప్రవేశం చేశారు. తర్వాతే ఎంపీగా ఎన్నికయ్యారు. ఇప్పుడు బొత్స అనూష కూడా అదే సెంటిమెంట్ ఫాలో అవుతారని క్యాడర్ భావిస్తోంది.
అనూష ఎంట్రీపై అధిష్ఠానం క్లారిటీ
మొత్తానికి విజయనగరం జిల్లా వైసీపీ శ్రేణులు అనూష ఎంట్రీపై ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటివరకు చూడని ఓ రాజకీయ నాయకురాలిని చూస్తున్నామనే భావనను కార్యకర్తలు సోషల్ మీడియా వేదికగా వారి అభిప్రాయాలను సైతం వ్యక్తం చేస్తున్నారు. ప్రజలు కూడా అనూషలో నాయకురాలిని చూస్తున్నారు. కోటి సంతకాల సేకరణలో ప్రజలతో మమేకం అయినప్పుడు వారు స్పందన చూసి నాయకులు సైతం ఆశ్చర్యపోయారు. వీటిన్నిటిని పరిశీలించిన పార్టీ అధిష్టానం అనూష ఎంట్రీపై క్లారిటీతో ఉన్నట్లు పార్టీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. అన్నీ కలిసొస్తే భవిష్యత్తులో ఎంపీ, ఎమ్మెల్యేగా తాను పోటీ చేసే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి.






