- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రాష్ట్రంలో సంచలనం.. బీజేపీ యువ నాయకుడి భయంకరమైన హత్య.. సీసీటీవీ ఫుటేజీలో విస్తుపోయే వాస్తవాలు..
కర్ణాటక కోప్పళ్ జిల్లా గంగవతిలో బీజేపీ యువ మోర్చా అధ్యక్షుడు వెంటేష్ కరుబాను దారుణంగా హత్య చేశారు దుండగులు. కారులో వచ్చిన నలుగురు కావాలనే బైక్‌పై వెళ్తున్న అతన్ని అడ్డుకుని.. కత్తులతో దాడి చేశారు. తీవ్రంగా గాయపరిచారు.

దిశ, వెబ్ డెస్క్ : కర్ణాటక కోప్పళ్ జిల్లా గంగవతిలో బీజేపీ యువ మోర్చా అధ్యక్షుడు వెంటేష్ కరుబాను దారుణంగా హత్య చేశారు దుండగులు. కారులో వచ్చిన నలుగురు కావాలనే బైక్‌పై వెళ్తున్న అతన్ని అడ్డుకుని.. కత్తులతో దాడి చేశారు. తీవ్రంగా గాయపరిచారు. హాస్పిటల్ సమీపంలో రాత్రి రెండున్నర గంటల సమయంలో ఈ ఎటాక్ జరగ్గా.. అతన్ని ఆస్పత్రిలో చేర్చినా లాభం లేకుండా పోయింది. అప్పటికే మరణించినట్లు ధృవీకరించారు వైద్యులు. ఇందుకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
కారు హఠాత్తుగా వచ్చి బైక్ ముందు ఆగడం.. కొన్ని నిమిషాల పాటు దాడి జరగడం.. తప్పించుకునేందుకు ప్రయత్నించిన యువ నాయకుడు పడిపోవడం క్లియర్‌గా కనిపిస్తుంది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు.. అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. వ్యక్తిగత కక్షలే ఇందుకు కారణమై ఉండొచ్చని ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఇక ఈ అంశంపై కర్ణాటక అసెంబ్లీ దద్దరిల్లింది. కాంగ్రెస్ హయాంలో లా అండ్ ఆర్డర్ వైఫల్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తుందని ఫైర్ అయ్యారు. మరోవైపు గంగవతిలో కార్యకర్తల నిరసనలతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.






