- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Bandi Sanjay: ఎమ్మెల్సీ ఎన్నికల్లో 3 ఎమ్మెల్సీ స్థానాల్లో గెలుపు బీజేపీదే: బండి సంజయ్

దిశ, వెబ్ డెస్క్: రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో (MLC Elections) మూడు స్థానాల్లో బీజేపీ ఘన విజయం సాధిస్తుందని కేంద్ర మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదివారం నల్లగొండ జిల్లా బీజేపీ (BJP) కార్యాలయంలో ఎమ్మెల్సీ ఎన్నికలపై కార్యకర్తలకు బండి సంజయ్ దిశానిర్ధేశం చేశారు. కమిట్‌మెంట్‌తో పనిచేస్తే పార్టీ క్యాడర్ బీజేపీకే సొంతం అవుతుందని ఈ సందర్భంగా కార్యకర్తలకు సూచించారు. ఒక్కో టీచర్‌ను రెండు మూడు సార్లు కలిసి ఓటు అడగాలని, ఎన్నికల పోలింగ్ రోజు వరకు విస్తృత ప్రచారం చేయాలని అన్నారు. అలాగే, నిజాయితీపరుడు, ఉద్యోగులతో సన్నిహిత సంబంధాలున్న సరోత్తం రెడ్డి బీజేపీ అభ్యర్థి కావడం గెలుపు సులువు కాబోతోందన్నారు.
బీజేపీని ఓడించేందుకు కాంగ్రెస్‌తో కలిసి BRS పనిచేస్తోందని, ఆ రెండు పార్టీల మధ్య జరిగిన క్విడ్ ప్రో కో (నీకింత..నాకింత లాభం) నడుస్తోందని ఆరోపించారు. స్కాముల్లో కూరుకుపోయి విచారణ ఎదుర్కొంటున్న BRS నేతలను అరెస్ట్ చేయకుండా ఉన్నందుకే ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపు కోసం BRS నేతలు అంతర్గతంగా పని చేస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వ వైఫల్యాలు, టీచర్లు, నిరుద్యోగులు, రైతులు, మహిళలు, విద్యార్థులకు ఇచ్చిన కాంగ్రెస్ మోసపూరిత హామీలను ఎండగట్టాలని పిలుపునిచ్చారు. విద్యారంగ దుస్థితి, టీచర్లకు జరుగుతున్న అన్యాయాన్ని వివరిస్తూ వారి పక్షాన బీజేపీ చేసిన పోరాటాలను గుర్తుచేయాలని బండి సంజయ్ కోరారు. ముఖ్యంగా 317 జీవోకు వ్యతిరేకంగా టీచర్ల సమస్యలపై మొదటి నుంచి పోరాడుతున్న ఏకైక పార్టీ బీజేపీ మాత్రమేనని తెలిపారు.
కేంద్ర బడ్జెట్‌లో ఉద్యోగులకు రూ.12.75 లక్షల ఐటీ మినహాయింపు తోపాటు 10 లక్షల ఉద్యోగాల భర్తీ, సక్రమంగా DAల చెల్లింపు, నిర్ణీత టైమ్‌లో PRC అమలు వంటి అంశాలను విస్తృతంగా ఉద్యోగుల్లోకి తీసుకెళ్లాలని పార్టీ కార్యకర్తలకు బండి సంజయ్ పిలుపునిచ్చారు. మోసపూరిత కాంగ్రెస్‌ను ఓడించి తగిన గుణపాఠం చెప్పాలని అన్నారు. నల్లగొండ జిల్లాలో ఎంతోమంది బీజేపీ కార్యకర్తలు బలిదానం చేశారని, ఒక్కసారి అయినా బీజేపీ అధికారంలోకి వస్తే కళ్లారా చూడాలని లక్షల మంది కార్యకర్తలు ఎదురు చూసారున్నారని చెప్పారు. వారి కలలను నిజం చేయాలని పిలుపునిచ్చారు.