- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
వచ్చే ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగానే పోటీ: ఈటల రాజేందర్
దిశ, ఆమనగల్లు: వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ ఒంటరిగానే పోటీ చేసి అత్యధిక సీట్లు గెలుపొంది ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుందని ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. మంగళవారం ఆమనగల్లు పట్టణ కేంద్రంలో తల్లోజు ఆచారి ఆధ్వర్యంలో నిర్వహించిన బీజేపీ విజయ సంకల్ప సభకు ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే ఈటల రాజేందర్, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, మాజీ పార్లమెంట్ సభ్యులు కొండ విశ్వేశ్వర్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే రైతుబంధు, రైతు బీమా, దళిత బంధు, ఆసరా పెన్షన్లు, కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ అన్ని అమలు చేస్తామన్నారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ అనుకూల వర్గం, వ్యతిరేక వర్గం మాత్రమే పోటీలో ఉంటాయన్నారు.
ఆచారి మాట్లాడుతూ.. 90 సీట్లతో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పరచడం ఖాయమన్నారు. డీకే అరుణ మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ చీకటి ఒప్పందంతో ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి రావాలని చూస్తున్నాయని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో జాతీయ నాయకురాలు బంగారు శృతి రంగారెడ్డి, నాగర్ కర్నూల్ జిల్లా బీజేపీ అధ్యక్షులు నర్సింహా రెడ్డి, సుధాకర్, నాగర్ కర్నూల్ బీజేపీ ఇంచార్జ్ దిలీప్ చారీ, రాష్ట్ర నాయకులు కండె హరిప్రసాద్, జిల్లా నాయకులు రాంరెడ్డి, మున్సిపాలిటీ చైర్మన్ రాంపాల్, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.