- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బండి సంజయ్ అరెస్ట్ ను ఖండించిన బీఎల్ సంతోష్
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్ట్ ను బీజేపీ జాతీయ నాయకుడు బీఎల్ సంతోష్ ఖండించారు.

X
దిశ, వెబ్ డెస్క్: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్ట్ ను బీజేపీ జాతీయ నాయకుడు బీఎల్ సంతోష్ ఖండించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. తెలంగాణలో బీఆర్ఎస్ పని అయిపోయిందని, అవినీతి కూపంలో ఆ పార్టీ కూరుకుపోయిందని ఆరోపించారు. ప్రజల నుంచి వ్యతిరేకత మొదలైందని స్పష్టం చేశారు. ప్రజా సమస్యలపై పోరాడుతున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ను బీఆర్ఎస్ అక్రమంగా అరెస్ట్ చేసిందని మండిపడ్డారు. బండి సంజయ్ అరెస్ట్ తో బీఆర్ఎస్ తన హద్దు మీరిందని, మూల్యం చెల్లించుకోకతప్పదని సంతోష్ హెచ్చరించారు. కాగా టెన్త్ క్లాస్ హిందీ పరీక్షా పేపర్ లీక్ వ్యవహారంలో బండి సంజయ్ పాత్ర ఉందంటూ పోలీసులు ఆయనను అరెస్ట్ చేసి యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మల రామారం పీఎస్ కు తరలించారు.
Next Story






