బీజేపీ ఎదుగదలను తట్టుకోలేకే బండి సంజయ్ అరెస్ట్.. బీజేపీ ఎంపీ అర్వింద్

by Dishafeatures2 |
బీజేపీ ఎదుగదలను తట్టుకోలేకే బండి సంజయ్ అరెస్ట్.. బీజేపీ ఎంపీ అర్వింద్
X

దిశ, వెబ్ డెస్క్: బండి సంజయ్ అరెస్ట్ ను బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ ఖండించారు. రాష్ట్రంలో బీజేపీ ఎదుగుదలను చూసి ఓర్వలేకే బండి సంజయ్ ను అరెస్ట్ చేశారని కేసీఆర్ పై ఫైర్ అయ్యారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీక్, ఢిల్లీ లిక్కర్ కేసులో కూతరు కవిత ఈడీ విచారణ తదితర విషయాలతో కేసీఆర్ ఫ్రస్టేషన్ లోకి వెళ్లిపోయారని, అందుకే ఇష్టమొచ్చినట్ల ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. ప్రజల పక్షాన బీజేపీ నాయకులు కొట్లాడుతున్నారు కాబట్టే సీఎం కేసీఆర్ తమను టార్గెట్ చేసుకొని అరెస్ట్ చేస్తున్నారని అన్నారు. అరెస్టులకు బీజేపీ నాయకులు భయపడరని, భవిష్యత్ లో మరింత దూకుడగా ముందుకెళ్తామని స్పష్టం చేశారు. బండి సంజయ్ ను వెంటనే రిలీజ్ చేయాలని డిమాండ్ చేశారు.

Next Story

Most Viewed