- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బీజేపీ నేతపై మహిళ సంచలన వీడియో.. నన్ను శారీరకంగా వాడుకున్నాడని తీవ్ర ఆరోపణలు
బీజేపీ లీడర్, మాజీ ఎమ్మెల్యేపై సెక్సువల్ హరాజ్మెంట్, మానసికంగా, శారీరకంగా వాడుకున్నాడనే ఆరోపణలు సంచలనం సృష్టిస్తున్నాయి. రెండో భార్యగా ప్రకటించిన మహిళ నుంచి ఇలాంటి అలిగేషన్స్ రావడం మరింత అటెన్షన్ క్యాచ్ చేశాయి. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతుండగా..

దిశ, వెబ్ డెస్క్ : బీజేపీ లీడర్, మాజీ ఎమ్మెల్యేపై సెక్సువల్ హరాజ్మెంట్, మానసికంగా, శారీరకంగా వాడుకున్నాడనే ఆరోపణలు సంచలనం సృష్టిస్తున్నాయి. రెండో భార్యగా ప్రకటించిన మహిళ నుంచి ఇలాంటి అలిగేషన్స్ రావడం మరింత అటెన్షన్ క్యాచ్ చేశాయి. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతుండగా.. ఈ టాపిక్ పూర్తి వివరాలు తెలుసుకుందాం.
ఉత్తరాఖండ్ హరిద్వార్‌కు చెందిన జ్వాలాపూర్ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే సురేశ్ రాథోడ్‌కు భార్య రవీంద్రా కౌర్, కొడుకు లక్కీ రాథోడ్ ఉన్నాడు. అయితే ఈయన మరో మహిళ ఊర్మిళ సనావర్‌తో దీర్ఘకాలికంగా వివాహేతర సంబంధంలో ఉన్నాడు. ఈ ఏడాది జూన్‌లో స్టేట్‌లో బహుభార్యత్వాన్ని నిషేధించిన సమయంలో సురేష్ ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించి.. ఊర్మిళను రెండో భార్యగా ప్రకటించాడు. ఆమె ప్రేమ గెలిచిందని తెలిపాడు. ఈ టైమ్‌లోనే ఆమె జుట్టును సెట్ చేసే వీడియో వైరల్ అయింది. అయితే బీజేపీ నాయకత్వం దీన్ని అవమానకరంగా భావించి.. షోకాజ్ నోటీసు జారీ చేసింది. ఆరేళ్ల పాటు పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. దీన్ని ఖండించిన సురేశ్.. దీన్ని సినిమా సీన్‌గా చెప్పి తప్పించుకున్నాడు. కానీ ఊర్మిళ మాత్రం తన సోషల్ మీడియా ప్రొఫైల్‌ను ఊర్మిళ సురేశ్ రాఠౌర్‌గా మార్చుకుంది.
ఇక ఈ వివాహం తర్వాత సుమారు 5 నెలలకు ఇప్పుడు వివాదాలు మళ్లీ ఎక్కువయ్యాయి. దీంతో ఊర్మిళ ఏడుస్తూ ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. సురేశ్.. తనను నాలుగేళ్లుగా వాడుకుంటున్నాడని.. మానసికంగా, శారీరకంగా తన కోరికలు తీర్చుకున్నాడని చెప్పింది. సురేశ్‌కు తాను చట్టపరమైన భార్య అని.. కానీ అతని ఫస్ట్ వైఫ, కొడుకుతనను బ్లాక్ మెయిల్ చేస్తున్నారని తెలిపింది. హరిద్వార్ ఎస్పీకి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని.. ప్రధాని నరేంద్ర మోడీ, యూపీ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యా నాథ్, ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ దామి తనకు న్యాయం చేయాలని కోరింది. సురేశ్ చాలా మంది అమ్మాయిల జీవితాలను నాశనం చేశాడని ఆరోపించింది. రెండేళ్లుగా న్యాయం కోరుతున్నానని.. పార్టీలో పని చేసే మహిళగా ఉన్నా సాయం చేయలేదని బాధపడింది. నాలుగు రోజుల్లో చర్యలు తీసుకోకపోతే బీజేపీ రాష్ట్ర కార్యాలయం ముందు ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరించింది.






