జార్ఖండ్‌లో అలీబాబా 40 దొంగల ప్రభుత్వం..MP Nishikant Dubey

by Vemula.Srinu Prasad |   (  Updated:2022-09-03 12:58:31  IST  )

రాంచీ: సీనియర్ బీజేపీ నేత, ఎంపీ నిషికాంత్ దూబే జార్ఖండ్ ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు.

జార్ఖండ్‌లో అలీబాబా 40 దొంగల ప్రభుత్వం..MP Nishikant Dubey
X

రాంచీ: సీనియర్ బీజేపీ నేత, ఎంపీ నిషికాంత్ దూబే జార్ఖండ్ ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. హేమంత్ సోరెన్ నేతృత్వంలోని జార్ఖండ్‌లో అలీబాబా 40 దొంగల ప్రభుత్వం ఉందని అన్నారు. జార్ఖండ్ ప్రభుత్వం దొంగలతో నిండిందని, హేమంత్ సోరెన్ అలీబాబా అని పేర్కొన్నారు. ఇప్పటివరకు హేమంత్ సోరెన్‌కు ఈసీ గానీ, గవర్నర్ గానీ ఎలాంటి అనర్హత లేఖ పంపకపోయిన భయంతో ఎమ్మెల్యేలను అటు ఇటు తిప్పుతున్నారని అన్నారు. 'సీబీఐ, ఈడీ కేసుల భయంతో మాట్లాడుతున్నవారు ఖచ్చితంగా దొంగే. ఎందుకంటే నిజాయితీగా ఉంటే భయపడాల్సిన అవసరం లేదు. సోరెన్ భయంతోనే ఎమ్మెల్యేలను తనవెంట తిప్పుకుంటున్నారు. మా పోరాటం ప్రజల కోసం. మధ్యంతర ఎన్నికలు నిర్వహించాలని మేము సవాల్ చేస్తున్నాం' అని దూబే అన్నారు. అంతకుముందు పలు రాష్ట్రాల్లో ఎమ్మెల్యేలను చేజిక్కించుకునేందుకు బీజేపీ కుట్ర రాజకీయాలు చేస్తుందని చత్తీస్‌గఢ్ సీఎం భూపేష్ బాఘేల్ విమర్శించారు. కాగా, ఇప్పటికే జార్ఖండ్ సీఎం తమ ఎమ్మెల్యేలతో సహా రాయ్‌పూర్ వెళ్లిన సంగతి తెలిసిందే.

Next Story