వాడికి ఓటమి తప్పదు.. బండ్ల గణేష్ ట్వీట్ వైరల్

by Gantepaka Srikanth |

టాలీవుడ్(Tollywood) సెన్సేషనల్ ప్రొడ్యూసర్, ప్రముఖ కమెడియన్ బండ్ల గణేష్(Bandla Ganesh) గురించి కొత్త పరిచయం అక్కర్లేదు.

వాడికి ఓటమి తప్పదు.. బండ్ల గణేష్ ట్వీట్ వైరల్
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్(Tollywood) సెన్సేషనల్ ప్రొడ్యూసర్, ప్రముఖ కమెడియన్ బండ్ల గణేష్(Bandla Ganesh) గురించి కొత్త పరిచయం అక్కర్లేదు. కమెడియన్‌గా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి.. ఆ తర్వాత ప్రొడ్యుసర్‌గా మారిపోయారు. ఇప్పుడు మళ్లీ కామెడీ సీన్లలో నటిస్తున్నారు. నిత్యం సోసల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే ఈయన.. సినిమాలకు సంబంధించిన విషయాలే కాకుండా రాజకీయాలకు సంబంధించిన అంశాలపైనా స్పందిస్తుంటారు. తాజాగా మరో ఇంట్రెస్టింగ్ ట్వీట్ పెట్టారు. ఎవరిని ఉద్దేశించి పెట్టారో తెలియదు కానీ.. పోస్ట్ చేసిన క్షణాల్లోనే వైరల్‌గా మారింది. ‘‘గెలిచిన వానికి ఓటమి తప్పదు.. ఓడిన వానికి గెలువక తప్పదు.. అనివార్యమైన ఇట్టి విషయమై శోకింప తగదు’’ అని ట్వీట్‌లో పేర్కొన్నారు. ఈ ట్వీట్‌ను గమనించిన నెటిజన్లు ఎవరి స్టైల్లో వారు రియాక్ట్ అవుతున్నారు.

కాగా, అంతకుముందు.. పవన్ కల్యాణ్(Pawan Kalyan) హీరోగా నటించిన తీన్ మార్ మూవీ డబ్బింగ్ మీద ఓ ఫ్యాన్ ఫిర్యాదు చేశాడు. ‘అసలు ఇలా లైవ్ డబ్బింగ్ ఎందుకు ఓకే చేశావ్ అన్నా.. థియేటర్లో అసలు డైలాగ్స్ కూడా వినిపించలేదు’ అని ట్వీట్ వేశాడు. దీనిపై బండ్ల గణేష్ రియాక్ట్ అయ్యాడు.. ఓకే ఇప్పుడు మళ్లీ డబ్బింగ్ చేయించి.. మంచిగా మిక్సింగ్ చేసి రీ రిలీజ్ చేస్తాను అని మాటిచ్చాడు. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఇది సాధ్యమేనా? అని అంతా అనుకుంటున్నారు.

ఇదిలా ఉండగా.. ప్రస్తుతం బండ్ల గణేష్ తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల వరకు సూపర్ యాక్టీవ్‌గా ఆ పార్టీకి పనిచేసిన బండ్లన్న.. అధికారంలోకి వచ్చాక ఆ పార్టీ కార్యక్రమాలకు కాస్త దూరంగా ఉంటున్నారు.


Next Story