వారు నా ఆత్మీయులు అంటూ పవన్ ఫ్యాన్స్‌కు బండ్ల గణేష్ షాక్..

by Disha Web Desk 6 |
వారు నా ఆత్మీయులు అంటూ పవన్ ఫ్యాన్స్‌కు బండ్ల గణేష్ షాక్..
X

దిశ, డైనమిక్ బ్యూరో: సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే నటుడు, నిర్మాత బండ్ల గణేష్ ముక్కుసూటిగా మాట్లాడే తత్వంతో సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న సంగతి తెలిసిందే. పవన్ కల్యాణ్ వీర భక్తుడిగా తనకు తానే క్లెయిమ్ చేసుకున్న బండ్ల గణేష్ కు జనసైనికులు, పవన్ అభిమానులు సైతం అంతే గౌరవంగా చూస్తారు. అలాంటి గణేష్ తాజాగా చేసిన వ్యాఖ్యలు సినీ, రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారాయి. 'రాజకీయాల వలన జీవితంలో చాలా నష్టపోయాను, నాకు ఏ రాజకీయాలతో ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదు అందరూ ఆత్మీయులే' అంటూ చేసిన బండ్ల గణేష్ తాజాగా చేసిన ట్వీట్ జన సైనికులతో పాటు బండ్ల గణేష్ అభిమానులను షాక్ కు గురి చేస్తోంది. ప్రస్తుత వైసీపీ మంత్రి రోజా, బండ్ల గణేష్ కు మధ్య గతంలో ఓ టీవీ చానెల్ లో డిబేట్ జరిగింది. ఈ సందర్భంగా వీరిద్దరి మధ్య చోటు చేసుకున్న వాగ్వాదానికి సంబంధించిన వీడియోను ఓ నెటిజన్ షేర్ చేస్తూ రోజాకు కౌంటర్ ఇవ్వడంలో బండ్ల గణేష్ అన్నే కరెక్ట్ అంటూ పోస్ట్ పెట్టాడు.

దీనిపై స్పందించిన బండ్ల గణేష్ రాజకీయాల వలన జీవితంలో తాను చాలా నష్టపోయానంటూ కామెంట్ చేయడం హాట్ టాపిక్ గా మారింది. అంతే కాదు ఆయన చేసిన ట్వీట్ పై పవన్ అభిమానులు రకరకాలుగా రియాక్ట్ కావడం పరిస్థితిని మరింత హీట్ పెంచుతోంది. 'కోల్పోవడానికి సిద్ధంగా ఉన్న వారే రాజకీయాల్లోకి రావాలి. లైక్ అవర్ బాస్' అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. దీనికి బదులు ఇస్తూ.. నాకంత స్థాయి లేదు అంత గొప్ప వాడ్ని కాదు సోదర అంటూ మరో ట్వీట్ చేశాడు. పవన్ కల్యాణ్ అంటే వల్లమాలిన అభిమానం కలిగిన బండ్ల గణేష్ జనసేనలో అఫీషియల్ గా సభ్యత్వం తీసుకోకపోయినా అప్రకటితంగానే ఆయన జనసేన సింపథైజర్ అనే పేరు పవన్ కల్యాణ్ అభిమానుల్లో ఏర్పడింది. అలాంటి బండ్ల గణేష్ అనూహ్యంగా రాజకీయాల వల్ల తాను జీవితంలో చాలా నష్టపోయానని అలాగే తనకు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదని చెప్పడం పవన్ అభిమానులకు నిరాశకు గురి చేస్తోంది.

బండ్ల గణేష్ ట్వీట్ పై పవన్ అభిమానులు రియాక్ట్ అవుతూ 'మీరు మా ప్రతినిధిగా వేదికలపై మాట్లాడుతుంటే మురిసిపోయాం.. మీమాటలను గుండెల్లో నింపుకున్నాం.. మీకు అండగా నిలవాలని నిశ్చయించుకున్నాం ఉంటాం' అని కామెంట్స్ చేస్తుంటే బండ్ల గణేష్ లో ఎంత మార్పు వచ్చింది? ఇలా మాట్లాడే వ్యక్తివి గతంలో త్రివిక్రమ్ ను ఎందుకు అలా తిట్టావ్ అంటూ ఈ వివాదంలో త్రివిక్రమ్ పేరును మరి కొంత మంది ప్రస్తావనకు తీసుకువస్తున్నారు. మరి కొందరేమో నువ్వు పవన్ కల్యాణ్ భక్తుడివి కాదు పిరికివాడివి. నీలాంటి వాళ్లు జనసేనకు సపోర్ట్ గా లేకపోవడమే బెటర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

2018లో కాంగ్రెస్ పార్టీ నుంచి తెలంగాణ అసెంబ్లీకి పోటీ చేసి ఓడిపోయిన బండ్ల గణేష్ ఆ తర్వాత రాజకీయంగా సైలెంట్ అవుతూ వస్తున్నారు. ఈ క్రమంలో ఏపీలో రాబోయే ఎన్నికల కోసం జనసేనాని పవన్ కల్యాణ్ స్పీడ్ పెంచారు. జగన్ ప్రభుత్వాన్ని కూలదోసి ప్రజారంజక పాలన అందించేందుకు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తానని శపథం చేస్తున్నాడు. అసలే ఏపీ రాజకీయం మంచి కాకమీదున్న సమయంలో రోజాతో జరిగిన డిబేట్ ను గురించి రియాక్ట్ అవుతూ తాను చాలా నష్టపోయానని.. రాజకీయాల్లో అందరూ తనకు ఆత్మీయులే అని చెప్పడం సంచలనంగా మారింది. పవన్ కల్యాణ్ ను ఆరాధించే బండ్ల గణేష్ పొలిటికల్ గా యూ టర్న్ తీసుకున్నారా? ఆయన నుంచి పవన్ కు నేరుగా కాకపోయినా మోరల్ గా అయినా సపోర్ట్ లభించదా అనే సందేహాలు ఇంటర్నెట్ లో హల్ చల్ చేస్తున్నాయి. బండ్ల గణేష్ తీసుకున్న నిర్ణయంతో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాలి మరి.

Read More: పబ్లిక్‌గాAnchor Suma కు లవ్ ప్రపోజల్.. (వీడియో)

Next Story

Most Viewed