చంద్రబాబు ఓ సైతాన్.. మంత్రి రోజా

by Dishafeatures2 |
చంద్రబాబు ఓ సైతాన్.. మంత్రి రోజా
X

దిశ, డైనమిక్ బ్యూరో : మా నమ్మకం నువ్వే జగన్, జగనన్నే మా భవిష్యత్‌ అని రాష్ట్ర ప్రజలు బలంగా విశ్వసిస్తున్నారని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ఆర్‌కే రోజా అన్నారు. అయితే చంద్రబాబును మాత్రం రాష్ట్రానికి పట్టిన దరిద్రం, సైతాన్ అంటూ విమర్శలు చేస్తున్నారని మంత్రి రోజా వెల్లడించారు. ప్రజలు బలంగా చెప్తున్నారని మంత్రి రోజా అన్నారు. పల్నాడు జిల్లా మాచర్లలో నిర్వహిస్తున్న జాతీయ స్థాయి ఎడ్ల పందేల పోటీలను మంత్రులు అంబటి రాంబాబు, ఆదిమూలపు సురేశ్, బాపట్ల ఎంపీ నందిగం సురేశ్‌లతో కలిసి మంత్రి ఆర్‌కే రోజా మంగళవారం ప్రారంభించారు. అనంతరం మంత్రి ఆర్‌కే రోజా మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నాలుగేళ్లలో అమలు చేసిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ మరోసారి అవకాశం ఇవ్వాలని కోరుతున్నారని మరి చంద్రబాబు హయాంలో ఏం చేశాడో జనంలోకి వెళ్లి చెప్పే ధైర్యముందా అని మంత్రి ఆర్‌కే రోజా ప్రశ్నించారు. దేశంలోనే ఏ సీఎం చేయాలేని విధంగా సీఎం వైఎస్ జగన్ సుపరిపాలన అందించారని కొనియాడారు. వైఎస్ జగన్ ప్రజా సర్వే చేయిస్తున్నారని ఈ సర్వేలో కుప్పంలో కూడా చంద్రబాబుకి ఓటమి తప్పదని తేలిందని మంత్రి ఆర్‌కే రోజా అన్నారు. ఓటుకు నోటు కోసం రాష్ట్రాన్ని రూ.1.50 లక్షల కోట్ల ఆస్తులను నాశనం చేశాడని మంత్ ఆర్‌కే రోజా ధ్వజమెత్తారు.

ఓటు అడిగే ధైర్యం జగన్‌కే ఉంది

2024 ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన పార్టీలు ఒంటరిగా పోటీ చేసే దమ్ముందా అని మంత్రి ఆర్‌కే రోజా సవాల్ విసిరారు. ఇరు పార్టీలు పొత్తు పెట్టుకోవడం ఖాయమని చెప్పుకొచ్చారు. చంద్రబాబును ముఖ్యమంత్రిని చేయడమే పవన్ కల్యాణ్ లక్ష్యమంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లు కలిసి వచ్చిన వైసీపీని ఓడించలేరని మంత్రి ఆర్‌కే రోజా ధీమా వ్యక్తం చేశారు. మంచి పరిపాలన అందిస్తేనే ఓటు వేయమని అడిగే ధైర్యం ఒక్క సీఎం జగన్‌కి మాత్రమే ఉందని అలాంటి సీఎం జగన్‌ను ఓడించడం ఎవరికీ సాధ్యం కాదని మంత్రి ఆర్‌కే రోజా స్పష్టం చేశారు. తెలుగుదేశం, జనసేన పార్టీలు సీఎం వైఎస్ జగన్‌పై నీతిమాలిన రాజకీయం చేస్తున్నాయని ఇకపై అలాంటి రాజకీయాలు చేస్తే ప్రజలు తరిమి కొడతారని మంత్రి ఆర్‌కే రోజా హెచ్చరించారు.

పిలిచి అవమానించిన చంద్రబాబు

తెలుగుదేశం హయాంలో తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మహిళా పార్లమెంట్ సమావేశాలకు పిలిచి చంద్రబాబు తీరని అవమానానికి గురి చేశారని మంత్రి ఆర్‌కే రోజా ఆరోపించారు. అసెంబ్లీలోనూ బయట తాను టీడీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంటే తట్టుకోలేక.. తన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక పోలీసులు ఇదే మాచర్లలో అవమానించుకుంటూ తీసుకెళ్లి హైదరాబాద్‌లో వదిలేశారని గుర్తు చేసుకుని భావోద్వేగానికి గురయ్యారు.అంతలా అవమానించబడ్డ తనను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అక్కున చేర్చుకున్నారని చెప్పుకొచ్చారు. ఏ పోలీసులైతే హైదరాబాద్ తీసుకెళ్లి వదిలేవారో అదే పోలీసుల సెక్యూరిటీతో మాచర్లలో అడుగుపెట్టానని మంత్రి ఆర్‌కే రోజా గుర్తు చేసుకున్నారు.

Also Read..

Minister Roja: దేశంలోనే బెస్ట్ టూరిజం స్పాట్‌గా ఆంధ్రప్రదేశ్.


Next Story

Most Viewed