- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాష్ట్రంలో కీలక పరిణామం.. ఎమ్మెల్యే రాజీనామా
తమిళనాడు రాజకీయాలు నిమిష నిమిషానికి హీటెక్కుతున్నాయి. ప్రధాన ప్రతిపక్షం అన్నాడీఎంకే (AIADMK) పార్టీకి వరుస షాక్‌లు తగులుతున్నాయి.

దిశ, వెబ్‌డెస్క్: తమిళనాడు రాజకీయాలు నిమిష నిమిషానికి హీటెక్కుతున్నాయి. ప్రధాన ప్రతిపక్షం అన్నాడీఎంకే (AIADMK) పార్టీకి వరుస షాక్‌లు తగులుతున్నాయి. నిన్న ముగ్గురు ఎమ్మెల్యేలు రాజీనామా చేసిన మరుసటి రోజే (మంగళవారం).. అంబసముద్రం నియోజకవర్గ ఎమ్మెల్యే ఇసక్కి సుబ్బయ్య (Esakki Subaya) కూడా తన పదవికి రాజీనామా చేశారు. ఆయన లోక్‌భవన్‌లో స్పీకర్‌కు వ్యక్తిగతంగా కలిసి తన రాజీనామా లేఖను సమర్పించారు. ఈ లేఖను పరిశీలించి త్వరలోనే తగిన నిర్ణయం తీసుకుంటానని స్పీకర్ మీడియాకు తెలిపారు.
రెండు రోజుల్లో నలుగురు అవుట్..
ముఖ్యమంత్రి సీ. జోసెఫ్ విజయ్ నేతృత్వంలోని టీవీకే (TVK) ప్రభుత్వానికి అనుకూలంగా అసెంబ్లీలో ఓటు వేసిన రెబల్ ఎమ్మెల్యేలలో ఈ సుబ్బయ్య కూడా ఒకరు. నిన్ననే (సోమవారం) ముగ్గురు అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు మరదముత్తూరు ఎమ్మెల్యే మరగాథం కుమారవేల్, ధరాపురం ఎమ్మెల్యే పి. సత్యభామ, పెరుందురై ఎమ్మెల్యే ఎస్. జయకుమార్ తమ పదవులకు రాజీనామా చేసి అధికార టీవీకే పార్టీలో చేరిన సంగతీ తెలిసిందే. ఇప్పుడు సుబ్బయ్య కూడా అదే బాట పట్టడంతో రెండు రోజుల్లోనే రాజీనామా చేసిన అన్నాడీఎంకే ఎమ్మెల్యేల సంఖ్య నాలుగుకు చేరింది.
రాజకీయ దుమారం..
ఈ వరుస రాజీనామాలపై అన్నాడీఎంకే అధినేత ఎడప్పాడి పళనిస్వామి (EPS), అలాగే డీఎంకే చీఫ్ ఎం.కె. స్టాలిన్ తీవ్రంగా మండిపడ్డారు. ఇదంతా అధికార టీవీకే పార్టీ నడిపిస్తున్న "గుర్రాల బేరం" (Horse-Trading) మరియు ముందస్తు వ్యూహంలో భాగమేనని వారు ఆరోపిస్తున్నారు. ఈ వరుస తిరుగుబాట్లు, రాజీనామాలతో తమిళనాడు అసెంబ్లీలో అన్నాడీఎంకే బలం క్రమంగా పడిపోతుండటంతో రాబోయే రోజుల్లో అక్కడ మరిన్ని ఉప ఎన్నికలు వచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.






