బాలకృష్ణ ఎమ్మెల్యేగా ఉంటే ఎంత? లేకపోతే ఎంత?

by Sujitha Rachapalli |

వైసీపీ అధికార ప్రతినిధి, యాంకర్ శ్యామల హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణపై సంచలన వ్యాఖ్యలు చేసింది. వరుసగా మూడుసార్లు గెలిచానని చెప్పుకునే నందమూరి బాలకృష్ణ.. ఇక్కడ ఎన్ని రోజులు కనబడతాడని ప్రశ్నించింది.

బాలకృష్ణ ఎమ్మెల్యేగా ఉంటే ఎంత? లేకపోతే ఎంత?
X

దిశ, వెబ్‌సైట్ : వైసీపీ అధికార ప్రతినిధి, యాంకర్ శ్యామల హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణపై సంచలన వ్యాఖ్యలు చేసింది. వరుసగా మూడుసార్లు గెలిచానని చెప్పుకునే నందమూరి బాలకృష్ణ.. ఇక్కడ ఎన్ని రోజులు కనబడతాడని ప్రశ్నించింది. ఎప్పుడో ఒకసారి వచ్చి మొహం చూపించి వెళ్లిపోయే ఆయనకు ఇక్కడ సమస్యల గురించి తెలుసా అని అడిగిన ఆమె.. ఒక ఎమ్మెల్యేగా ఆయన ఉంటే ఎంత? లేకపోతే ఎంత? అని కామెంట్ చేసింది. నిజంగా వాళ్లు గెలిచిన గెలుపు ఎలాంటిదో అందరికీ తెలుసని.. హిందూపూర్ నియోజకవర్గమే దీనికి ప్రూఫ్ అని తెలిపింది శ్యామల. ఇది ప్రజలు ఇచ్చిన తీర్పు కాదని.. ఈవీఎంల ఎఫెక్ట్ అన్న ఆమె.. ప్రముఖ నాయకుడు కనబడుట లేదు అంటూ డిప్యూటీ సీఎం ఫొటో చూపిస్తూ విమర్శలు గుప్పించింది.

Next Story