- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఫోన్ ట్యాపింగ్ లిస్ట్‌లో టాలీవుడ్ టాప్ యాంకర్, నటి.. ఇంకా ఎంతమంది ఉన్నార్రా అంటూ ఫ్యాన్స్ ఫైర్
తెలుగు రాష్ట్రాల్లో ఫోన్ ట్యాపింగ్ కేసు సంచలనం సృష్టిస్తోంది. ఇప్పటికే పలువురి స్టేట్మెంట్స్ రికార్డ్ చేశారు. కానీ బీఆర్ఎస్ నేతలు మాత్రం చప్పుడు చేయడం మరిచిపోయారు.

దిశ, వెబ్‌సైట్ : తెలుగు రాష్ట్రాల్లో ఫోన్ ట్యాపింగ్ కేసు సంచలనం సృష్టిస్తోంది. ఇప్పటికే పలువురి స్టేట్మెంట్స్ రికార్డ్ చేశారు. కానీ బీఆర్ఎస్ నేతలు మాత్రం చప్పుడు చేయడం మరిచిపోయారు. కాదని వారించడం, మీడియా ముందుకు రావడం మానేశారు. ఎందరో సినీతారలు ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులు బాధితులుగా ఉండగా.. జబర్దస్త్ యాంకర్ అనసూయ భరద్వాజ్ ఫోన్ కూడా ట్యాప్ అయినట్లు సమాచారం. ఇందుకు సంబంధించిన వీడియోలు, న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అయిపోతుంది. దీనిపై స్పందిస్తున్న అనసూయ ఫ్యాన్స్.. మా అనసూయక్క ఏం చేసిందని ఫోన్ ట్యాప్ చేయించారని ప్రశ్నిస్తున్నారు. ఆమె ఫోన్ ఎలా ట్యాప్ చేయాలనిపించింది అంటున్న అభిమానులు.. మీ లిస్ట్‌లో ఇంకెంతమంది ఉన్నారని అడుగుతున్నారు.
కాగా ప్రస్తుతం అనసూయ పలు ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉంది. బుల్లితెరపై యాంకర్‌గా, జడ్జిగా అదరగొడుతోంది. ఇక రామ్ చరణ్ రంగస్థలంలో నటించి రంగమ్మత్తగా బిరుదు పొందిన ఈ బ్యూటీ.. ఆ తర్వాత వచ్చిన రజాకార్, రంగమార్తాండ లాంటి చిత్రాల్లోనూ మంచి క్యారెక్టర్స్‌తో ఆడియన్స్‌ను ఎంటర్‌టైన్ చేసింది. డిఫరెంట్ క్యారెక్టర్స్ అందుకుంటూ దూసుకుపోతోంది.






