- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
Amit Shah: రెండేళ్లలో ఆ ప్రాజెక్టు పూర్తి చేస్తాం.. అమిత్ షా
దిశ వెబ్ డెస్క్: కేంద్ర హోం వ్యవహారాల మంత్రి అమిత్ షా ఎన్నికల ప్రచారంలో భాగంగా నేడు ఆంధ్రప్రదేశ్‌లోని హిందూపురం లోక్‌సభ పరిధిలో పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన ధర్మవరం చేరుకున్నారు. ధర్మవరం చేరుకున్న అమిత్‌షాకు కూటమి శ్రేణులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయనను చంద్రబాబు సత్కరించారు.
కాగా టీడీపీ అధినేత ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అమిత్ షా కలిసి ఒకే వేదికపై కనిపించడం గత ఆరు సంవత్సరాల్లో ఇదే మొదటిసారి కావడం గమనార్హం. కాగా ఈ కార్యక్రమంలో అమిత్ షా మాట్లాడుతూ.. ఏపీ ప్రజలకు పోలవరం ప్రాజెక్టు జీవనాడి అని పేర్కొన్నారు. అలానే పోలవరానికి జాతీయ హోదా కల్పించడంలో బీజేపీ కీలక పాత్ర పోషించిందని వెల్లడించారు.
అయితే అవినీతిలో కూరుకుపోయిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ఆలస్యం అయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీలో చంద్రబాబు, కేంద్రంలో మోడీ సర్కార్ వస్తే రెండేళ్లలో పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తామని అమిత్‌షా స్పష్టం చేశారు.
Read More..
కులమతాలకు అతీతమైన పార్టీ బీజేపీ: కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్