కళకు హ్యాట్సాఫ్‌.. సూర్యరశ్మితో డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ బొమ్మ..

by Indraja |

సీనీ హీరోలకి, రాజకీయ నాయకులకి అభిమానులు ఉడడం సర్వ సాధారణం.

కళకు హ్యాట్సాఫ్‌.. సూర్యరశ్మితో డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ బొమ్మ..
X

దిశ వెబ్ డెస్క్: సీనీ హీరోలకి, రాజకీయ నాయకులకి అభిమానులు ఉడడం సర్వ సాధారణం. అయితే పురుషుల్లో పుణ్యపురుషులు వేరు అన్నట్టు అటు హీరోల్లోనూ.. ఇటు రాజకీయ నేతల్లోనూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాత్రం ప్రత్యేకం. అందరికీ అభిమానులు ఉంటే.. డిప్యూటీ సీఎం పవన్‌కు మాత్రం భక్తులు ఉంటారు అని అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు అని అనడానికి మండుటెండలో చెక్కపై బుతద్ధంతో నిప్పుని పుట్టించి ఫైరింగ్ ఆర్ట్ చేసి డిప్యూటీ సీఎం పవన్‌పై తనకున్న అభిమానాన్ని చాటుకోవడమే నిదర్శనం.

వివరాల్లోకి వెళ్తే.. శ్రీకాకుళం జిల్లా, ఇచ్చాపురం మండలం, మండపల్లి గ్రామానికి చెందిన పాతిర్ల.సర్వన్ అనే బాలుడు ఇచ్చాపురం రవీంద్రభారతి పాఠశాలలో పదవ తరగతి చదువుతున్నాడు. కాగా అతను డిప్యూటీ సీఎం పవన్‌కు వీరాభిమాని. దీనితో సూర్యకాంతిని ఉపయోగించి తన అభిమాన నాయకుడి ముఖచిత్రాన్ని చిత్రీకరించారు. అనంతరం దాన్ని ఇచ్చాపురం నియోజకవర్గ జనసేన సమన్వయకర్త దాసరి.

రాజుకు అందజేశారు. ఈ నేపథ్యంలో దాసరి.రాజు మాట్లాడుతూ సర్వన్ పలువురుకి ఆదర్శప్రాయమని కొనియాడారు. అలానే బావి తరాల భవిష్యత్ కు భరోసా కల్పించే నాయకుడు పవన్ కళ్యాణ్ నని, అతనిపై వుండే అభిమానంతో సన్ లైట్ ద్వారా చిత్రికరించడం అభినందనీయమని హర్షం వ్యక్తం చేశారు. తనలోని ప్రతిభకి ప్రోత్సాహం అందించవలసిందిగా తల్లిదండ్రులను అభ్యర్థించి, సర్వన్‌ను ఘనంగా సన్మానించారు.

Next Story