పట్టభద్రుల ఓటర్ నమోదులో పోటాపోటీ

by  |
పట్టభద్రుల ఓటర్ నమోదులో పోటాపోటీ
X

దిశ ప్రతినిధి, రంగారెడ్డి: పట్టభద్రుల ఓటర్ నమోదులో ఆయా పార్టీల నాయకులు పోటీ పడుతూనే ప్రచారం షురూ చేసిన్రు. అధికార పార్టీ ఏ సందర్భంలోనైనా టీఆర్ఎస్ అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించాలని సూచిస్తున్నాయి. అంతేకాకుండా వ్యూహాత్మకంగా పరిచయమున్న గ్రాడ్యుయేట్స్ ను గ్రూపులుగా విభజించి ప్రచారంతోపాటు ఓటర్ నమోదు దరఖాస్తు చేసుకునేలా ప్రణాళికలు చేస్తూ ఆర్భాటాలు చేస్తున్నారు. దీంతో ప్రజల్లో ఓ ఉత్తేజాన్ని నింపి యువతను తమ వైపు తిప్పుకునేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టారు.

బీజేపీ కార్యకర్తలు, అనుబంధ సంఘాల కార్యకర్తలతో ఓటర్ నమోదును చేసుకుంటుంది. అదే ఇండిపెండింట్ అభ్యర్థిగా, ప్రజా సంఘాల మద్దతుతో బరిలో నిలుస్తున్న నాగేశ్వర్ రావు తమకున్న పరిచయాలతో ప్రచారంతోపాటు ఓటర్ నమోదులో అంతర్గత దూసుకుపోతున్నారు. ఉమ్మడి హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‎నగర్ పట్టభద్రుల స్థానం నుంచి గెలుపోంది ప్రజలు, గ్రాడ్యుయేట్ల మన్నలను పోందారు. అయితే ఇదే మద్దతు తమకు ఉంటుందని నాగేశ్వర్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న బీజేపీ నాయకుడు రాంచందర్ రావు పట్టణ ప్రాంతాలపైనే ప్రత్యేకంగా పోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. బీజేపీ, ఆర్ఎస్ఎస్, సంఘ పరివార్ నాయకులు, కార్యకర్తల గ్రాడ్యుయేట్ ఓటర్లు పూర్తిస్థాయిలో మద్దతు ఉంటుందని పార్టీలో చర్చించుకుంటున్నారు. ప్రధానంగా హైదరాబాద్, రంగారెడ్డి అర్బన్ ప్రాంతాల్లోనే ఓటర్ నమోదుకు గట్టిగా పనిచేసుకుంటున్నారు.

అభ్యర్ధిపై అనుమానం తొలిగినట్లే…

పట్టభద్రుల ఎన్నకల్లో సత్తా చాటేందుకు టీఆర్ఎస్ ఓటర్ నమోదు కార్యక్రమంలో క్రీయశీలకంగా వ్యవహరిస్తోంది. పార్టీ కార్యకర్తలకు, మండల నాయకులకు ఓటర్ నమోదు బాధ్యతలు అప్పగించింది. గ్రామశాఖ, సర్పంచ్, వార్డు మెంబర్ మొదలు మండల కమిటీలోని ప్రతి సభ్యుడిని ఓటర్ నమోదులో నిమగ్నమయ్యైలా పార్టీ చర్యలు తీసుకుంది. ప్రతి నియోజకవర్గంలో ఎమ్మెల్యేలు పట్టభద్రుల ఓటర్ నమోదుపై స్ధానిక నాయకులను ఆరా తీస్తున్నారు. టీఆర్ఎస్ పార్టీ అభ్యర్ధిని ఫైనల్ చేసినట్లు స్పష్టమవుతుంది. జీహెచ్ఎంసీ మేయర్ బోంతు రాంమోహన్ ను పట్టభద్రుల ఎమ్మెల్సీ బరిలో ఉండనున్నట్లు వచ్చిన వార్తలు నిమజమనిపిస్తున్నాయి. ఆదివారం మేయర్ తమ ఫేసుబుక్ అకౌంట్ ద్వారా పట్టభద్రుల ఓటర్ నమోదు చేసుకోవాలని ఓ లింక్ను పోస్టు చేయడం జరిగింది. అయితే ఆ లింక్కులో ఎడమవైపు పైన కేసీఆర్, కేటీఆర్ పోటోలు… కుడివైపు కింది బాగాన మేయర్ బోంతు రాంమోహన్ ఫోటో ఉన్న పోస్టర్ ఫేసుబుక్‎లో పోస్టు చేయడంతో అనుమానాలకు స్వస్తి పలికనట్లైయింది.

కాంగ్రెస్ లో క్లారిటీ లేదు…

పట్టభద్రుల ఎన్నికల్లో కాంగ్రెస్ పెద్దగా పట్టించుకున్నట్లు ఎక్కడ కనిపించడం లేదు. పట్టభద్రుల ఓటర్ నమోదులో కాంగ్రెస్ పార్టీ తమ భాగస్వామ్యం ఎక్కడ కూడా కనిపించడం లేదు. అంతేకాకుండా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బరిలో ఉండే అభ్యర్థుల పేర్లు పెద్దగా కనిపించడం లేదు. ఆ ఆశావహులైన ఓటర్ నమోదు కార్యక్రమంలో కనిపించడం లేదు. దీంతో ఆ పార్టీ బరిలో ఉంటుందా… లేదా అనే అనుమానాలున్నాయి. అధిష్టానం నుంచి జిల్లా కాంగ్రెస్ నాయకులకు, కార్యకర్తలకు క్లారిటీ లేకపోవడంతో వెనుకముందు ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఏవిధంగా వ్యవహరిస్తోందో వేచి చూడాల్సిందే.

సోషల్ మీడియాలో ప్రచారం…

బరిలో నిలవనున్న మాజీ ఎమ్మెల్సీ, ప్రొఫెసర్ నాగేశ్వర్ సోషల్ మీడియా వేధికగా తమదైన ప్రచారం చేసుకుంటున్నారు. ఇప్పటికే పలుమార్లు వాట్సాప్, యూట్యూబ్, ఫేసుబుక్ లో తమ సందేశాలను పంపిస్తున్నారు. ప్రజా సంఘాల, పార్టీల నాయకులు తమకున్న వాట్సప్ గ్రూపులల్లో నాగేశ్వర్ అభ్యర్థిత్వాన్ని బలపర్చాలని కోరుతున్నారు. ప్రధాన పార్టీలు కూడా నాగేశ్వర్ కు మద్దతు ప్రకటించాలా లేదా అనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. అదేవిధంగా టీఆర్ఎస్ సైతం సోషల్ మీడియాలో విస్తృతంగానే ప్రచారం చేస్తోంది. బోంతు రాంమోహన్ పేరు దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. అందుకోసమే స్వయంగా మేయర్ బోంతు రాంమోహన్ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి పట్టభద్రుల ఓటర్ నమోదు చేసుకోవాలని సూచించడంతో సందేహాలు తొలగిపోయాయి.


Next Story

Most Viewed