జనవరి 31న దేశవ్యాప్తంగా పోలియో చుక్కలు

51

దిశ, వెబ్‌డెస్క్: నిండు జీవితానికి రెండే చుక్కలు అన్న నినాదంతో.. పల్స్ పోలియో కార్యక్రమానికి తేదీ ఖరారు అయింది. ఈ నెల 30 వ తేదీన పల్స్ పోలియోను రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ప్రారంభించనున్నారని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే, ఇదే నెల 31న దేశ వ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహించనున్నారు. దీంతో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు పోలియో కేంద్రాల ఏర్పాటు కోసం తగు చర్యలు తీసుకోవాలని కేంద్ర ఆరోగ్య శాఖ ఆదేశాలు జారీ చేసింది. అయితే, తొలుత జనవరి 17న నిర్వహించాల్సిన ఈ కార్యక్రమం కొవిడ్ డ్రైరన్‌తో వాయిదా పడిన సంగతి తెలిసిందే. దేశంలో ప్రతీ ఏటా నిర్వహించే పోలియో చుక్కలు.. పోలియో వ్యాధి సోకకుండా 5 ఏళ్ల లోపు వేస్తారు.

Image