- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
షర్మిల సభకు లైన్ క్లియర్
<p>దిశ, వెబ్‌డెస్క్: వైఎస్ షర్మిల ఖమ్మం బహిరంగ సభకు లైన్ క్లియర్ అయింది. వచ్చే నెల 9న ఖమ్మంలో లక్షమందితో భారీ బహిరంగ సభ నిర్వహించుకునేందుకు ఖమ్మం పోలీసులు అనుమతిచ్చారు. కోవిడ్ నిబంధనలతో సభకు అనుమతి ఇస్తున్నట్లు షర్మిల కార్యాలయానికి ఖమ్మం పోలీసులు సమాచారం ఇచ్చారు. శానిటైజర్లు, మాస్కులు, ఫిజికల్ డిస్టెన్స్ పాటించేలా చర్యలు తీసుకోవాలని ఖమ్మం పోలీసులు తెలిపారు. వచ్చే నెల 9న ఖమ్మంలో జరగనున్న భారీ బహిరంగ సభలో పార్టీ ప్రకటన చేయనున్నట్లు గత […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: వైఎస్ షర్మిల ఖమ్మం బహిరంగ సభకు లైన్ క్లియర్ అయింది. వచ్చే నెల 9న ఖమ్మంలో లక్షమందితో భారీ బహిరంగ సభ నిర్వహించుకునేందుకు ఖమ్మం పోలీసులు అనుమతిచ్చారు. కోవిడ్ నిబంధనలతో సభకు అనుమతి ఇస్తున్నట్లు షర్మిల కార్యాలయానికి ఖమ్మం పోలీసులు సమాచారం ఇచ్చారు.
శానిటైజర్లు, మాస్కులు, ఫిజికల్ డిస్టెన్స్ పాటించేలా చర్యలు తీసుకోవాలని ఖమ్మం పోలీసులు తెలిపారు. వచ్చే నెల 9న ఖమ్మంలో జరగనున్న భారీ బహిరంగ సభలో పార్టీ ప్రకటన చేయనున్నట్లు గత కొద్దిరోజుల క్రితం షర్మిల ప్రకటించిన విషయం తెలిసిందే.
ఈ క్రమంలో సభకు అభిమానులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. ఖమ్మంలో జరగనున్న సభలో పార్టీ పేరుతో పాటు పార్టీ జెండాను ఆవిష్కరించే అవకాశాలున్నాయి.
Next Story






