- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
టీఆర్ఎస్ ప్రచారానికి పోలీస్ వాహనాలు!
by Vadlamudi Anukaran |
<p>దిశ, శేరిలింగంపల్లి : గ్రేటర్ ఎన్నికల్లో గెలుపే ప్రధాన ఎజెండాగా అన్ని వనరులను వాడేస్తోంది టీఆర్‌ఎస్ పార్టీ. పబ్లిక్ ప్లేస్‌లు, మెట్రో పిల్లర్లపై యాడ్స్ పట్ల ప్రతిపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నా పట్టించుకోని అధికార పార్టీ పర్మిషన్ తీసుకున్నామని చెప్పి వాటిని అలాగే ఉంచింది. తాజాగా పోలీస్ వాహనాల్లో ఒక కారుకు అధికార పార్టీ గులాబీ జెండా, మరో కారులో అదే పార్టీకి సంబంధించిన ప్రచార సామగ్రి ఉన్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. అయితే జెండాతోనే […]</p>

X
దిశ, శేరిలింగంపల్లి : గ్రేటర్ ఎన్నికల్లో గెలుపే ప్రధాన ఎజెండాగా అన్ని వనరులను వాడేస్తోంది టీఆర్‌ఎస్ పార్టీ. పబ్లిక్ ప్లేస్‌లు, మెట్రో పిల్లర్లపై యాడ్స్ పట్ల ప్రతిపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నా పట్టించుకోని అధికార పార్టీ పర్మిషన్ తీసుకున్నామని చెప్పి వాటిని అలాగే ఉంచింది. తాజాగా పోలీస్ వాహనాల్లో ఒక కారుకు అధికార పార్టీ గులాబీ జెండా, మరో కారులో అదే పార్టీకి సంబంధించిన ప్రచార సామగ్రి ఉన్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. అయితే జెండాతోనే పోలీస్ ఆయా గల్లీల్లో గస్తీ నిర్వహించడం గమనార్హం. కారుకు జెండా కట్టిందెవరో తెలియదని, ఆలస్యంగా గమనించి తొలగించామని పోలీసులు చెబుతున్నా మరో కారులో ప్రచార సామగ్రి సంగతేంటని పలువురు నెట్టింట్లో ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. మరి వీటికి వారి నుండి ఎలాంటి సమాధానం వస్తుందో చూడాలి.
Next Story






