- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పోలీసు వాహనానికే రక్షణ కరువు.. పెట్రోలింగ్ వాహనం చోరీ..
<p>దిశ, స్టేషన్ ఘన్ పూర్: పెట్రోలింగ్ నిర్వహించే పోలీసు వాహనానికి రక్షణ లేదంటే ఇక సామాన్య వ్యక్తుల వాహనాల పరిస్థితి ఏంటని ఆందోళన చెందే సంఘటన ఇది. జనగామ జిల్లా స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గం లింగాల గణపురం మండలం నెల్లుట్ల – మాణిక్యపురం శివారులో పోలీస్ పెట్రోలింగ్ వాహనాన్ని గుర్తు తెలియని వ్యక్తి దొంగిలించి వదిలేసిన సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. వివరాలు… జనగామ జిల్లా కేంద్రానికి చెందిన పెట్రోలింగ్ వాహనం సిబ్బందితో జనగామ శివారులోని హైవే […]</p>

దిశ, స్టేషన్ ఘన్ పూర్: పెట్రోలింగ్ నిర్వహించే పోలీసు వాహనానికి రక్షణ లేదంటే ఇక సామాన్య వ్యక్తుల వాహనాల పరిస్థితి ఏంటని ఆందోళన చెందే సంఘటన ఇది. జనగామ జిల్లా స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గం లింగాల గణపురం మండలం నెల్లుట్ల – మాణిక్యపురం శివారులో పోలీస్ పెట్రోలింగ్ వాహనాన్ని గుర్తు తెలియని వ్యక్తి దొంగిలించి వదిలేసిన సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. వివరాలు… జనగామ జిల్లా కేంద్రానికి చెందిన పెట్రోలింగ్ వాహనం సిబ్బందితో జనగామ శివారులోని హైవే వద్ద నిన్న రాత్రి వాహనాలు తనిఖీ లు చేశారు. హైవే పై వెళుతున్న లారీలను పోలీసులు తనిఖీ చేస్తుండగా గుర్తు తెలియని వ్యక్తి పోలీస్ పెట్రోలింగ్ వాహనాన్ని గుట్టుచప్పుడు కాకుండా దొంగిలించాడు.
తనిఖీల అనంతరం తమ వాహనం కోసం చూడగా పెట్రోలింగ్ వెహికల్ అపహరణకు గురైనట్టు గుర్తించిన సిబ్బంది దాన్ని వెతకడం ప్రారంభించారు. చోరీకి గురైన పెట్రోలింగ్ వాహనం లింగాల గణపురం మండలం మాణిక్యపురం వద్ద లభించడంతో సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. విధినిర్వహణలో ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించే సిబ్బంది సామాన్య ప్రజలకు రక్షణ ఎలా కల్పిస్తారు అనేది జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.






