- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అలర్ట్.. మావోయిస్టుల కదలికలపై పోలీసుల నిఘా
by Batti.Sumithra |
<p>దిశ, వాజేడు : మావోయిస్టు కదలికలపై నిఘా పెట్టిన పోలీసులు ములుగు జిల్లా వాజేడు మండల పరిధిలోని 163 జాతీయ రహదారి పై తనిఖీలు చేపట్టారు. వెంకటాపురం సర్కిల్ సీఐ శివ ప్రసాద్ ఆధ్వర్యంలో గురువారం ముమ్మరంగా సోదాలు నిర్వహించారు. రహదారి మీదుగా వెళ్తున్న వాహనాలను క్షుణ్ణంగా పరిశీలించి, ప్రయాణికుల బ్యాగులను సైతం చెక్ చేశారు. అనుమానిత వ్యక్తుల చిరునామాలను సేకరించినట్లు సమాచారం. గోదావరి పరివాహక ప్రాంతాల్లోని పోలీసులను సైతం అలర్ట్ చేశారు. ఎప్పటికప్పుడు పోలీసు వర్గాలు […]</p>

X
దిశ, వాజేడు : మావోయిస్టు కదలికలపై నిఘా పెట్టిన పోలీసులు ములుగు జిల్లా వాజేడు మండల పరిధిలోని 163 జాతీయ రహదారి పై తనిఖీలు చేపట్టారు. వెంకటాపురం సర్కిల్ సీఐ శివ ప్రసాద్ ఆధ్వర్యంలో గురువారం ముమ్మరంగా సోదాలు నిర్వహించారు. రహదారి మీదుగా వెళ్తున్న వాహనాలను క్షుణ్ణంగా పరిశీలించి, ప్రయాణికుల బ్యాగులను సైతం చెక్ చేశారు. అనుమానిత వ్యక్తుల చిరునామాలను సేకరించినట్లు సమాచారం. గోదావరి పరివాహక ప్రాంతాల్లోని పోలీసులను సైతం అలర్ట్ చేశారు. ఎప్పటికప్పుడు పోలీసు వర్గాలు అప్రమత్తంగా ఉండి ప్రత్యేక చర్యలు చేపట్టాలని నిఘా వర్గాలు హెచ్చరించినట్లు సమాచారం. దీంతో గత మూడు రోజులుగా జాతీయ రహదారులపై పోలీసు బలగాలు మోహరిస్తున్నాయి.
Next Story






