- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కరోనా దెబ్బకు పోలీస్ స్టేషన్ క్లోజ్
<p>దిశ, వెబ్‌డెస్క్: కరోనా ఎఫెక్ట్ అన్ని రంగాలపై ప్రభావం చూపిందని విన్నాం.. కానీ, వైరస్ ఎఫెక్ట్ ఏకంగా పోలీస్ స్టేషన్ మీద కూడా పడింది. లాక్‌డౌన్‌లో షాపులు మూసినట్టు.. వైరస్ కారణంగా పోలీస్ స్టేషన్‌నే మూసివేశారు. ఈ ఘటన ఎక్కడో కాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరగడం గమనార్హం. వివరాళ్లోకి వెళితే.. నెల్లూరు జిల్లా వెంకటగిరి పీఎస్‌లో కరోనా కాటు వేసింది. పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న సీఐ, ఎస్సైతో పాటు మిగతా 9 మందికి కరోనా పాజిటివ్‌గా […]</p>

దిశ, వెబ్‌డెస్క్: కరోనా ఎఫెక్ట్ అన్ని రంగాలపై ప్రభావం చూపిందని విన్నాం.. కానీ, వైరస్ ఎఫెక్ట్ ఏకంగా పోలీస్ స్టేషన్ మీద కూడా పడింది. లాక్‌డౌన్‌లో షాపులు మూసినట్టు.. వైరస్ కారణంగా పోలీస్ స్టేషన్‌నే మూసివేశారు. ఈ ఘటన ఎక్కడో కాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరగడం గమనార్హం. వివరాళ్లోకి వెళితే.. నెల్లూరు జిల్లా వెంకటగిరి పీఎస్‌లో కరోనా కాటు వేసింది. పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న సీఐ, ఎస్సైతో పాటు మిగతా 9 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో ఆ స్టేషన్‌కు కరోనా భయం పట్టుకుంది. ఈ ఘటనపై అప్రమత్తమైన ఉన్నతాధికారులు పీఎస్ మూసివేయాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే, ఓ కేసులో నిందితులు అరెస్ట్ అయిన వారు, స్టేషన్ స్వీపర్ల నుంచి వైరస్ సోకినట్టు సమాచారం. వైరస్ సోకిన పోలీసులందరినీ క్వారంటైన్‌కు తరలించి.. వారి కుటుంబ సభ్యులు, ప్రైమరీ కాంటాక్టు ఉన్నవారికి అధికారులు కొవిడ్ పరీక్షలు చేస్తున్నారు.






