- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మామిడి కాయ దొంగలను జైలుకు పంపిన పోలీసులు
<p>దిశ, జగిత్యాల: పోలీసులు తనిఖీలు చేస్తుండగా ఇద్దరు దొంగలు పారిపోయేందుకు యత్నించారు. వెంటనే అప్రమత్తమైన అధికారులు వెంబడించి పట్టుకోగా.. చివరకు మామిడికాయ దొంగలు అని తేలింది. పూర్తి వివరాళ్లోకి వెళితే.. జగిత్యాల మండలం మోరపెల్లి గ్రామ శివారులోని మొర్రి విజయ్ అనే రైతు తన మామిడి తోటలో గుర్తుతెలియని వ్యక్తులు మామిడి కాయలు దొంగిలించారని ఫిర్యాదు చేయగా.. పోలీసులు కేసు నమోదు చేశారు. సోమవారం ఉదయం 11 గంటలకు చల్‌గల్ గ్రామ ఎక్స్ రోడ్ వద్ద రూరల్ […]</p>

దిశ, జగిత్యాల: పోలీసులు తనిఖీలు చేస్తుండగా ఇద్దరు దొంగలు పారిపోయేందుకు యత్నించారు. వెంటనే అప్రమత్తమైన అధికారులు వెంబడించి పట్టుకోగా.. చివరకు మామిడికాయ దొంగలు అని తేలింది. పూర్తి వివరాళ్లోకి వెళితే.. జగిత్యాల మండలం మోరపెల్లి గ్రామ శివారులోని మొర్రి విజయ్ అనే రైతు తన మామిడి తోటలో గుర్తుతెలియని వ్యక్తులు మామిడి కాయలు దొంగిలించారని ఫిర్యాదు చేయగా.. పోలీసులు కేసు నమోదు చేశారు. సోమవారం ఉదయం 11 గంటలకు చల్‌గల్ గ్రామ ఎక్స్ రోడ్ వద్ద రూరల్ పోలీసులు వాహనాల సోదాలు చేపట్టారు. ఇదే సమయంలో ఒక ప్యాసింజర్ ఆటోలో మామిడికాయలతో నలుగురు వ్యక్తులు వస్తూ పోలీసులను చూసి ఇద్దరు పారిపోగా.. మిగిలిన ఇద్దరు వ్యక్తులు పట్టుబడ్డారు. వీరిని విచారించగా మామిడి కాయలను దొంగతనం చేశామని ఒప్పుకోవడంతో వారి నుండి రెండు క్వింటాళ్ల మామిడి కాయలను స్వాధీనం చేసుకున్నారు. ఆటోను సీజ్ చేసి ఇద్దరిని రిమాండ్‌కు తరలించారు.






