- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గుప్పుమన్న గుట్కా.. భారీగా స్వాధీనం..
<p>దిశ, అదిలాబాద్: పక్కా సమాచారం మేరకు పోలీసులు అక్రమంగా రవాణా అవుతున్న నిషేధిత గుట్కా స్వాధీనం చేసుకున్నారు. వివరాలిలా ఉన్నాయి.. శుక్రవారం విశ్వసనీయ సమాచారం మేరకు ఇచ్చోడ సీఐ రవీందర్, ఎస్సై రవీంద్ర ఆధ్వర్యంలో బెల్లూరి గ్రామం వద్ద జాతీయ రహదారిపై వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ క్రమంలో హైదరాబాద్ నుండి ఆదిలాబాద్ వైపు వెళ్తున్న ఐచర్ డీసీఎం వాహనాన్ని తనిఖీ చేయగా.. నిందితులు వాహనాన్ని వదిలి పరారయ్యారు. వాహనంలో పరిశీలించగా..100 బ్యాగుల్లో 17.50 లక్షల విలువైన […]</p>

దిశ, అదిలాబాద్: పక్కా సమాచారం మేరకు పోలీసులు అక్రమంగా రవాణా అవుతున్న నిషేధిత గుట్కా స్వాధీనం చేసుకున్నారు. వివరాలిలా ఉన్నాయి.. శుక్రవారం విశ్వసనీయ సమాచారం మేరకు ఇచ్చోడ సీఐ రవీందర్, ఎస్సై రవీంద్ర ఆధ్వర్యంలో బెల్లూరి గ్రామం వద్ద జాతీయ రహదారిపై వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ క్రమంలో హైదరాబాద్ నుండి ఆదిలాబాద్ వైపు వెళ్తున్న ఐచర్ డీసీఎం వాహనాన్ని తనిఖీ చేయగా.. నిందితులు వాహనాన్ని వదిలి పరారయ్యారు.
వాహనంలో పరిశీలించగా..100 బ్యాగుల్లో 17.50 లక్షల విలువైన గుట్కా ప్యాకెట్లు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. పంచనామా నిర్వహించి గుట్కా ప్యాకెట్లతో పాటు వాహనాలను స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ పేర్కొన్నారు. నిందితులను త్వరలో పట్టుకుని అరెస్టు చేస్తామని తెలిపారు. డ్రైవర్ పరారీలో ఉన్నాడని అతని వివరాలు సేకరించామని పేర్కొన్నారు.






