తెలంగాణలో నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. త్వరలో పోలీస్ నోటిఫికేషన్.?

by  |
TS-Police
X

దిశ, వెబ్‌డెస్క్ : తెలంగాణలో నిరుద్యోగులకు గుడ్ న్యూస్. పోలీసు శాఖలో మరోసారి భారీ స్థాయిలో నోటిఫికేషన్ వెలువడనుంది. ఈ మేరకు పోలీస్ శాఖ కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తోంది. తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి పోలీసు శాఖలో ఖాళీలను గుర్తించి వివరాలను ఆర్ధిక శాఖకు అందించారు. ఈ మేరకు రాష్ట్రంలో 19వేల కానిస్టేబుల్ పోస్టులు, 625 ఎస్‌ఐ పోస్టులకు నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఆర్థిక శాఖ నుంచి ఆమోదం రాగానే నోటిఫికేషన్ విడుదలయ్యే ఛాన్స్ ఉంది. అయితే, 2018లో పోలీసు శాఖలో భారీ నోటిఫికేషన్ వెలువడిన విషయం తెలిసిందే. 2018లో 16వేల కానిస్టేబుల్స్‌కు, 1,217 ఎస్‌ఐ పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది. మళ్లీ అదే స్థాయిలో ఈ సారి కూడా నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

Next Story

Most Viewed