- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గుట్కా స్థావరాలపై పోలీసుల దాడులు
by Batti.Sumithra |
<p>దిశ ప్రతినిధి, నిజామాబాద్: నిజామాబాద్ నగరంలోని టౌన్ 1, టౌన్ 5 పోలిస్ స్టేషన్‌ల పరిధిలో రెండు చోట్ల గుట్కా స్థావరాలపై పోలీసులు దాడులు నిర్వహించారు. ఆయా పోలీసు స్టేషన్ల పరిధిలో రెండు చోట్ల అక్రమంగా గుట్కాను నిల్వ చేసినట్టు పోలీసులకు విశ్వసనీయ సమాచారం అందింది. నిజామాబాద్ పోలిస్ కమిషనర్ కార్తికేయ అదేశాల మేరకు దాడులు నిర్వహించామనీ టాస్క్ ఫోర్స్ సీఐ షాకీర్ ఆలీ తెలిపారు. ఒకటవ టౌన్ పరిధిలోని ఆర్‌యండీ గుట్కాలను విక్రయిస్తున్న మహ్మద్ ఆరీఫ్, […]</p>

X
దిశ ప్రతినిధి, నిజామాబాద్: నిజామాబాద్ నగరంలోని టౌన్ 1, టౌన్ 5 పోలిస్ స్టేషన్‌ల పరిధిలో రెండు చోట్ల గుట్కా స్థావరాలపై పోలీసులు దాడులు నిర్వహించారు. ఆయా పోలీసు స్టేషన్ల పరిధిలో రెండు చోట్ల అక్రమంగా గుట్కాను నిల్వ చేసినట్టు పోలీసులకు విశ్వసనీయ సమాచారం అందింది. నిజామాబాద్ పోలిస్ కమిషనర్ కార్తికేయ అదేశాల మేరకు దాడులు నిర్వహించామనీ టాస్క్ ఫోర్స్ సీఐ షాకీర్ ఆలీ తెలిపారు.
ఒకటవ టౌన్ పరిధిలోని ఆర్‌యండీ గుట్కాలను విక్రయిస్తున్న మహ్మద్ ఆరీఫ్, 5వటౌన్ పోలిస్ స్టేషన్ పరిధిలో విమల్ గుట్కా విక్రయిస్తున్న మొహమ్మద్ అబ్దుల్‌లను అరెస్టు చేసినట్టు సీఐ తెలిపారు. వారి దగ్గర నుంచి లక్ష విలువ చేసే గుట్కాను, ఒక స్కూటర్‌ను స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. ఇద్ధరిపై కేసు నమోదు చేసినట్లు సీఐ పెర్కొన్నారు.
Next Story






