బిగ్‌ బ్రేకింగ్ : మంత్రి హరీశ్‌ రావు గెస్ట్ హౌజ్‌లో తనిఖీలు

by  |

దిశ, హుజురాబాద్ రూరల్ : హుజురాబాద్ ఎన్నికల ప్రచార గడువు ముగుస్తున్న నేపథ్యంలో హుజురాబాద్‌లో పోలీసులు అప్రమత్తం అయ్యారు. రాష్ట్ర మంత్రులు తన్నీరు హరీష్ రావు, కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్‌తో పాటు పలువురు ప్రముఖులు ఇంత కాలం తమ గెస్ట్ హౌజ్‌గా వినియోగించుకున్న సింగాపురంలోని నివాసాన్ని పోలీసులు తనిఖీ చేశారు. ఎంపీ కెప్టెన్ లక్ష్మీకాంతరావుకు చెందిన కిట్స్ కాలేజీ ఆవరణలో ఉన్న ఈ అతిథి గృహాన్ని పోలీసులు క్షుణ్ణంగా తనిఖీ చేశారు. కాగా, హుజురాబాద్ ఓటర్లకు సీల్డ్ కవర్‌లో రూ.6వేలు పంపిణీ చేస్తున్నది మంత్రి హరీశ్ రావు వర్గీయులు అని తెలియడంతో ఈ తనిఖీలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.

FOLLOW US ON ► Facebook , Google News , Twitter , Koo , ShareChat , Telegram , Disha TV

Next Story