- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రాష్ట్రంలో నేరాలు తగ్గాయి: హోంమంత్రి
by Shyam |
<p>దిశ, తెలంగాణ క్రైమ్‌బ్యూరో: రాష్ట్రంలో నేరాలు తగ్గాయని, ఆరేళ్లలో ఎలాంటి మత ఘర్షణలు చోటు చేసుకోక పోవడమే ఇందుకు నిదర్శనమని హోంమంత్రి మహమూద్ అలీ అన్నారు. బుధవారం ఎల్బీస్టేడియంలో పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం నిర్వహించగా ముఖ్య అతిథిగా హాజరైన హోంమంత్రి మాట్లాడారు. హైదరాబాద్‌లో 3.50లక్షలకు పైగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని తెలిపారు. ప్రపంచంలోనే అత్యధిక సీసీ కెమెరాలు ఏర్పాటు చేసిన నగరాల్లో హైదరాబాద్‌కు 20వ స్థానం లభించిందన్నారు. మహిళలు, పిల్లల భద్రతకు అత్యంత ప్రాధాన్యత […]</p>

X
దిశ, తెలంగాణ క్రైమ్‌బ్యూరో: రాష్ట్రంలో నేరాలు తగ్గాయని, ఆరేళ్లలో ఎలాంటి మత ఘర్షణలు చోటు చేసుకోక పోవడమే ఇందుకు నిదర్శనమని హోంమంత్రి మహమూద్ అలీ అన్నారు. బుధవారం ఎల్బీస్టేడియంలో పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం నిర్వహించగా ముఖ్య అతిథిగా హాజరైన హోంమంత్రి మాట్లాడారు. హైదరాబాద్‌లో 3.50లక్షలకు పైగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని తెలిపారు. ప్రపంచంలోనే అత్యధిక సీసీ కెమెరాలు ఏర్పాటు చేసిన నగరాల్లో హైదరాబాద్‌కు 20వ స్థానం లభించిందన్నారు. మహిళలు, పిల్లల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నట్లు పేర్కొన్నారు. డీజీపీ మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ దేశ అంతర్గత భద్రతకు సవాలుగా మారిన ఉగ్రవాదం, నేరస్తులను ఎదుర్కోవడంలో పోలీసులు నిరంతర కృషి చేస్తున్నారని తెలిపారు. కరోనా, భారీ వర్షాలు సమయంలోనూ పోలీసులు విశేష సేవలందిస్తున్నారని కొనియాడారు.

Next Story






