టీఆర్ఎస్ ప్లీనరీ సమావేశానికి భారీ బందోబస్తు

by  |
టీఆర్ఎస్ ప్లీనరీ సమావేశానికి భారీ బందోబస్తు
X

దిశ, డైనమిక్ బ్యూరో: టీఆర్ఎస్ పార్టీ ద్విదశాబ్ది వేడుకల్లో భాగంగా సోమవారం మాదాపూర్‌లోని HICC హైటెక్స్‌లో ఏర్పాటు చేసిన ప్లీనరీకి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. రాష్ట్రంలోని టీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులందరూ ప్లీనరీలో పాల్గొననున్నందున పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. రాష్ట్ర నలుమూలల నుంచి నగరంలోకి భారీగా వాహనాలు రానున్న క్రమంలో ట్రాఫిక్‌కు అంతరాయం కలుగకుండా పలు రూట్లలో ఆంక్షలు విధించారు. ఈ క్రమంలో నగరవాసులకు ఎటువంటి ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నారు. ప్లీనరీలో పాల్గొనేందుకు సీఎం కేసీఆర్ ఉదయం 11 గంటలకు HICC గేట్ నెంబర్-4 కి చేరుకోనున్నారు.

ఈ సందర్భంగా పోలీసు బందోబస్తుపై మాదాపూర్ డీసీసీ మాట్లాడుతూ.. సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర ఆధ్వర్యంలో ఆరుగురు డీసీపీలు, ఎనిమిది మంది ఎస్పీలు, 20 డీఎస్పీలు, 71 సీఐలు, 262 మంది ఎస్ఐలు ఇలా మొత్తం 1514 మంది పోలీసులతో బందోబస్తు నిర్వహించామని తెలిపారు. అంతేగాకుండా ట్రాఫిక్ పోలీసులు కూడా 750 మంది డ్యూటీలో ఉండగా మొత్తం 2352 మంది ఫీల్డ్‌లో ఉన్నారు. స్టేజీ మీద 93 మందికి మాత్రమే అనుమతి ఉంది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సీనియర్ లీడర్లకు రెండు గ్యాలరీలు, ఎన్ఆర్ఐ ప్రతినిధులకు ఒక గ్యాలరీ, రాష్ట్ర ప్రతినిధులకు ఒక గ్యాలరీ ఏర్పాటు చేశారని తెలిపారు.


Next Story

Most Viewed