భారత్ బంద్‌లో పోలీసుల ఓవరాక్షన్.. నిరసనకారులపై లాఠీచార్జ్.(వీడియో)

by  |
భారత్ బంద్‌లో పోలీసుల ఓవరాక్షన్.. నిరసనకారులపై లాఠీచార్జ్.(వీడియో)
X

దిశ, మేడ్చల్ టౌన్ : మేడ్చల్‌లో భారత్ బంద్ ఉద్రిక్తతకు దారితీసింది. బంద్ నేపథ్యంలో మేడ్చల్ జాతీయ రహదారిపై ఆందోళనకారులు సోమవారం రాస్తారోకో నిర్వహించారు. విషయం తెలుసుకున్న మేడ్చల్ పోలీసులు అక్కడికి చేరుకొని.. ఆందోళనకారులపై లాఠీచార్జ్ చేసి, విచక్షణ రహితంగా కొట్టారు. దీంతో ఆందోళకారులు పోలీసుల తీరుపై మండిపడుతున్నారు. బంద్‌లో భాగంగా నిరసన తెలియజేసే హక్కు లేదా అని ఆగ్రహం వ్యక్తంచేశారు.

దీంతో పోలీసులు వారిని ఆరెస్ట్ చేసి మేడ్చల్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. పోలీసుల తీరుపై అఖిలపక్ష నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అకారణంగా తమపై పోలీసులు లాఠీచార్జ్ చేశారని, ప్రభుత్వానికి తొత్తుగా పోలీసులు వ్యవహారిస్తున్నారని నర్సింగరావు ఆరోపించారు. కాగా రాస్తారోకోలో మాజీ పీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య, జడ్పీటీసీ హరివర్దన్ రెడ్డి తదితర నాయకులు పాల్గొన్నారు. పోలీసుల తీరుకు నిరసనగా స్టేషన్ వద్ద ఆందోళన చేపట్టారు.


Next Story