గుడేప్పాడ్ లో పోలీసుల తనిఖీలు.. నలబై వాహనాలకు ఫైన్లు..

by  |
గుడేప్పాడ్ లో పోలీసుల తనిఖీలు.. నలబై వాహనాలకు ఫైన్లు..
X

దిశ, ఆత్మకూర్ : హన్మకొండ జిల్లా ఆత్మకూర్ మండలంలోని గుడేప్పాడ్ సెంటర్ లో వరంగల్ పోలీస్ కమిషనర్ డా. తరుణ్ జోషి, పరకాల ఏసీపీ శివరామయ్య ఆదేశాల మేరకు వాహనాలను తనిఖీ చేశారు. సరైన నంబర్ ప్లేట్ లు , సరైన పత్రాలు లేని వాహనదారులకు మరియు హెల్మెట్ లేని వారికి, కౌన్సిలింగ్ నిర్వహించారు. సుమారు 40 వాహనాలకు జరిమానాలు విధించారు. సరైన పత్రాలు లేని 4 మోటార్ సైకిల్ లను సీజ్ చేసారు. ఈ కార్యక్రమంలో ఆత్మకూర్ సీఐ రంజిత్ కుమార్ , ఎస్ ఐ రాజబాబు మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.



Next Story