పోయిన పర్సును సీసీ కెమెరాలతో గుర్తించిన పోలీసులు… అందులో నగదుతోపాటు బంగారు నగలు

208
police-hand-over-to-lady

దిశ, పరకాల: ప్రజా భద్రత విషయంలో సీసీ కెమెరాల ప్రాధాన్యతను మరోమారు నిరూపించారు పరకాల పోలీసులు. ఇందుకు సంబంధించిన వివరాల ప్రకారం.. ఆదివారం ఉదయం జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం చెన్నాపురం గ్రామానికి చెందిన ఒన్నాల రజిత హన్మకొండలోని తన కూతురు ఇంటి వద్ద నుంచి ఆటోలో పరకాలకు చేరుకుంది. పరకాలలో దిగిన అనంతరం తన చేతిలోని పర్సును ఎక్కడో జారవిడుచుకుంది. అందులో 300 రూపాయలతో పాటు కొన్ని నగలు కూడా ఉన్నాయి. కాసేపటికి పర్సు పడిపోయినట్లు గుర్తించిన రజిత స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. వెంటనే స్పందించిన పోలీసులు సీసీ పూటేజీ విజువల్స్ పరిశీలించి పడిపోయిన పర్సు మరో వ్యక్తికి దొరికినట్లుగా గుర్తించారు. వెంటనే ఆ వ్యక్తిని పిలిపించి రజిత పర్సులోని నగదు, నగలను భద్రంగా అప్పగించారు. దీంతో పరకాల పోలీసులుకు రజిత కృతజ్ఞతలు తెలిపింది. ఈ ఘటనతో సీసీ కెమెరాల ప్రాధాన్యత మరోమారు నిరూపించబడింది. సీసీ కెమెరాలు ఏర్పర్చుకొని, కాపాడుకోవాల్సిన బాధ్యత ఎంతగానో ఉందని తెలుస్తోంది.