ప్రొద్దుటూరులో ప్రేమోన్మాది అరెస్ట్

69

దిశ, వెబ్‌డెస్క్: కడప జిల్లా ప్రొద్దుటూరులో ఓ యువతిపై దాడి చేసిన ప్రేమోన్మాదిని పోలీసులు అరెస్ట్ చేశారు. శుక్రవారం ఓ యువతిపై సునీల్ అనే వ్యక్తి కత్తితో దాడి చేశాడు. తీవ్ర గాయాలపాలైన యువతి ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. బాధితురాలి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. నిందితుడు సునీల్‌ను ప్రొద్దుటూరు రైల్వే స్టేషన్ వద్ద అదుపులోకి తీసుకున్నారు.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..