30 నిమిషాల్లో ఆరుగురు రేపిస్టులను పట్టుకున్న డాబర్‌మ్యాన్..

by Vadlamudi Anukaran |   (  Updated:2021-08-20 03:39:02  IST  )

<p>దిశ, ఫీచర్స్: క్రిమినల్ కేసుల ఇన్వెస్టిగేషన్‌లో భాగంగా పోలీసులు డాగ్ స్క్వాడ్స్‌ ఉపయోగిస్తుంటారని తెలిసిందే. స్మెల్‌ ఆధారంగానే దొంగలు లేదా హంతకులను పసిగట్టే ట్రైన్డ్ డాగ్స్.. నేర పరిశోధనలో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంటాయి. ఇదే క్రమంలో గుజరాత్‌లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. వడోదర పోలీస్ డాగ్ స్క్వాడ్‌‌‌లోని శునకం కేవలం 30 నిమిషాల్లోనే ఆరుగురు రేపిస్టులను పోలీసులకు పట్టించింది. వడోదరలో 30 ఏళ్ల మహిళపై అత్యాచారానికి పాల్పడ్డ దుండగులు ఆ తర్వాత ఆమెను హత్య చేశారు. [&hellip;]</p>

30 నిమిషాల్లో ఆరుగురు రేపిస్టులను పట్టుకున్న డాబర్‌మ్యాన్..
X

దిశ, ఫీచర్స్: క్రిమినల్ కేసుల ఇన్వెస్టిగేషన్‌లో భాగంగా పోలీసులు డాగ్ స్క్వాడ్స్‌ ఉపయోగిస్తుంటారని తెలిసిందే. స్మెల్‌ ఆధారంగానే దొంగలు లేదా హంతకులను పసిగట్టే ట్రైన్డ్ డాగ్స్.. నేర పరిశోధనలో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంటాయి. ఇదే క్రమంలో గుజరాత్‌లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. వడోదర పోలీస్ డాగ్ స్క్వాడ్‌‌‌లోని శునకం కేవలం 30 నిమిషాల్లోనే ఆరుగురు రేపిస్టులను పోలీసులకు పట్టించింది.

వడోదరలో 30 ఏళ్ల మహిళపై అత్యాచారానికి పాల్పడ్డ దుండగులు ఆ తర్వాత ఆమెను హత్య చేశారు. ఈ కేసును చాలెంజ్‌గా తీసుకున్న పోలీసులు విచారణలో స్నిఫర్ డాగ్ ‘జావా’ సాయం తీసుకున్నారు. ఈ మేరకు ఒక బాటిల్‌తో పాటు దుపట్టాను పసిగట్టిన శునకం.. నిందితుడు పారిపోయిన దిశగా పోలీసులను నడిపించింది. అహ్మదాబాద్-ముంబై రైల్వే ట్రాక్ దాటి దాదాపు రెండు కిలోమీటర్ల దూరం తీసుకెళ్లి, అక్కడున్న ఓ టెంట్ దగ్గర ఆగి మొరగడం ప్రారంభించింది. దీంతో పోలీసులు నిందితులను పట్టుకోగలిగారు.

45 రోజుల వ్యవధిలోనే పలు హత్య కేసుల్లో నిందితులను గుర్తించేందుకు డాబర్‌మ్యాన్ పోలీసులకు సాయపడటం ఇది మూడోసారి. తాజా కేసులో ఆగస్టు 16న కర్జన్ తాలూకా పరిధిలోని దేహ్తాన్ గ్రామ సమీపంలో గడ్డికోస్తున్న మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడి హత్య చేశారు. ఈ ఘటనలో కర్జాన్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు కాగా, స్నిఫర్ డాగ్ జావాతో క్రైమ్ స్పాట్‌కు చేరుకున్న పోలీసులు.. ముందుగా నిందితుల్లో ఒకరైన యూపీకి చెందిన 22 ఏళ్ల లాల్ బహదూర్ గిర్జారాంను అరెస్టు చేసి, ఆ తర్వాత మిగతావారిని పట్టుకున్నారు.

Next Story